జాతీయ వార్తలు

పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: మచిలీపట్నం, కాకినాడ, నక్కపల్లి ప్రాంతాల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను అందచేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం చెప్పారు. పునర్విభజన చట్టంలో చేసిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. చమురు శుద్ధి కర్మాగారం నుంచి లభించే అదాయం అతి తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలటంతో దానికి బదులు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణంపై దృష్టి పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గెయిల్, హెచ్‌పీసీఎల్ ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన అధ్యయనం చేస్తున్నాయని ఆయన శ్రీనివాస్‌కు తెలిపారు. వచ్చే జూన్ నాటికి అధ్యయనం పూర్తవుతుందని ఆయన చెప్పారు. నాలుగేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకోండి
భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు తగినన్ని నిధులను కేటాయించి ఆదుకోవలసిందిగా తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్‌మోహన్ నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో ఆయన 377వ నిబంధన కింద ఈ మేరకు ఒక తీర్మానం ప్రతిపాదించారు. భారీగా కురిసిన వర్షాలవల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కనీసం మూడువేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.