సంజీవని

పిల్లల ఎదుగుదలలో జాప్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన కొత్తల్లో పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు. ఆ తరువాత క్రమంగా నిద్ర తగ్గిస్తూ పారాడటం, తప్పటడుగులు వేయడం ప్రారంభిస్తారు. ఈ లోకం గురించి తెలుసుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. ప్రతిదాని దగ్గరికి వెళ్లి దాన్ని తాకడమో, పడేయడమో చేస్తుంటారు.
పిల్లలు ఇలాంటి పనులు చేయాలంటే శరీరంలో తగిన బలం అవసరం. అంతేకాకుండా శరీర బ్యాలెన్స్‌ని నిలుపుకోవడం అవసరం. అవయవాలమధ్య సమన్వయాన్ని సాధించగలగాలి. పడుకోకుండా అటూ ఇటూ తిరగాలనే కోరిక పిల్లల్లో ఎంత ఎక్కువగా వుంటే అంత శారీరక మానసిక అభివృద్ధి కనిపిస్తుంది. కొంతమందిలో చురుకుగా వుండడం తక్కువై కదలికలు తగ్గుతాయి. దాంతో ‘మైల్‌స్టోన్స్’ ఆలస్యవౌతాయి. ఆ విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. పిల్లల కదలికలకు అడ్డంగా సామాన్లు లేకుండా చూసుకోవాలి. కాస్త వస్తువుల్ని లాగినా కింద పడకుండా జాగ్రత్తగా వాటిని అమర్చుకోవాలి. నిప్పు, నీరు లాంటివాటిని పిల్లలు పారాడే, నడిచే, ఆడుకునే ప్రదేశాలలో ఉండకుండా చూడాలి. పిల్లల్ని ఒకచోట నిర్బంధించకూడదు. వాళ్ళని ఎప్పుడూ గమనిస్తుండాలి. టేబుల్ క్లాత్‌లాంటివి కిందకి వేలాడేలా ఉంచకూడదు. గాజు, పింగాణి వస్తువుల్ని పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
ఇలా క్రమక్రమంగా పెరగడంలో పిల్లలు చుట్టూ వున్నవారిని గుర్తుపట్టడం, నవ్వడం, బోర్లాపడటం, పారాడటం, శబ్దాల్ని వినడం, మాట్లాడటానికి ప్రయత్నించడం... వీటినే మైల్‌స్టోన్స్ అంటారు. ఇవి ఆలస్యవౌతుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

-డా పి.సి.పి.గుప్తా సైకియాట్రిస్ట్ .. 98480 63547