జాతీయ వార్తలు

యుద్ధ విమాన పైలెట్లుగా ముగ్గురు యువతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తొలిసారిగా యుద్ధ విమాన పైలెట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు యువతులు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దుండిగల్లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 130పైలెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు. భారత వాయుసైన్యంలో ఇప్పటిదాకా మహిళా పైలెట్లకు యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి లేదు. యుద్ధ విమానాలు నడిపే బాధ్యత అప్పగించాలని ఇటీవల వైమానిక రంగంలో పనిచేస్తున్న మహిళలు రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దుండిగల్ ఎయిర్‌ఫోర్టులో శిక్షణ పూర్తి చేసుకున్న 22మంది మహిళా పైలెట్లలో ముగ్గురికి యుద్ధ విమానాలు నడిపే బాధ్యతను రక్షణ మంత్రి అప్పగించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అవనీ చతుర్వేది, రాజస్థాన్‌కు చెందిన మోహనాసింగ్, బీహార్‌కు చెందిన భావనాకాంత్‌లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీదుగా బాధ్యతలు స్వీకరించారు.