ప్రకాశం

బతుకుదెరువు బుగ్గిపాలయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు , మార్చి 12: ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో తాను బతుకుతూ మరొకరకి ఉపాధి కల్పిస్తున్న ముత్యాల వాసు అనే వ్యక్తి ఆశయం సోమవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతైంది. ఎండ్లూరు గ్రామ నివాసి ముత్యాల వాసు అనే యువకుడు ఆవులు, గేదెలతో డెయిరీ ఏర్పాటు చేసుకున్నాడు. దీని నిర్వాహణకు ప్రస్తుతం ఒంగోలులో నివాసం ఉంటున్న బొమ్మినేని సుబ్బారావు పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో పశువుల కొట్టం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పశువుల కొట్టంలో మంటలు రావడంతో గమనించి అందులోని పశువులను అగ్నిప్రమాదం నుంచి బయటకు తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో నాలుగు పెద్ద ఆవులు, మూడు దూడలు అగ్నికి ఆహుతవగా, మరో మూడు గేదెలు గాయాల పాలయ్యాయి. విషయాన్ని పొలం యజమాని అయిన బొమ్మినేని సుబ్బారావుకు తెలియజేయగా స్పందించిన సుబ్బారావు హుటాహుటిన గ్రామానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై సంతనూతలపాడు పోలీసులకు సమాచారం అందించారు. ట్రైనీ ఏఎస్పీ బింధుమాధవ్ సంఘటనా స్థలానికి సందర్శించి ప్రమాదానికి కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నాడు. బాధితుడు వాసు అదే గ్రామానికి చెందిన బొడ్డు వెంకట్రావుపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వెంకట్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గ్రామస్తులు మూగజీవాలు ఆహుతి కావడంపై తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.