జాతీయ వార్తలు

వినూత్నతకు బాటలు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు గ్లోబల్ లీడర్ అవార్డు స్వీకారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలంటే ప్రభుత్వంలో వినూత్న మార్గాలకు దారులు వేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాగా, రాష్టప్రతి భవన్‌నుంచి వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టినందుకుగాను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యుసి బర్కిలీ-హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రాష్టప్రతిని గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించింది. వినూత్నకు బాటలు వేయడం భవిష్యత్తుకు ఒక మార్గమని, ఎందుకంటే అది అంతర్గతంగాను, బైటినుంచి కూడా అన్ని మార్గాలనుంచి విజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి దోహదపడుతుందని, ఒక సంస్థగా ప్రభుత్వ సంస్థలకు వినూత్నతకు తలుపులు తెరవడం చాలా ముఖ్యమని, ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం వాటి బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి రహస్యాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మొత్తం సమాచారాన్ని ప్రజల ముందుంచడం, పారదర్శకతను ప్రోత్సహించడం, నూతనత్వానికి బాటలు వేయడం, కొత్త మార్గాలను తెరవడం చాలా ముఖ్యమని రాష్టప్రతి అన్నారు.
గురువారం రాష్టప్రతి భవన్‌లో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యుసి బర్కిలీ-హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రాష్టప్రతికి గ్లోబల్ లీడర్ అవార్డును ప్రదానం చేసిన అనంతరం ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కాగా, రాష్టప్రతి ఈ అవార్డును దేశ ప్రజలకు, రాష్టప్రతి భవన్‌లోని తన సిబ్బంది, సహచరులకు అంకితం చేసారు. ఇలాంటి చర్యల ద్వారా భారత దేశంలోని సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తన సిబ్బంది, సహచరులు తనకు ఎంతో తోడ్పాటు అందించారని ఆయన చెప్పారు.
రాష్టప్రతిగా గత మూడున్నరేళ్ల కాలంలో ప్రణబ్ ముఖర్జీ యువతలోను, ఇతర వర్గాల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహించడంతో పాటుగా రాష్టప్రతి ఎస్టేట్ ఈ ఏడాది ప్రారంభంలో మొట్టమొదటిసారి ‘ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్’ను నిర్వహించడం తెలిసిందే. అంతేకాకుండా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చేసిన ప్రతి ప్రసంగంలో కూడా ఆయన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడడమే కాకుండా పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విద్యాసంస్థలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో టైఅప్‌లు పెట్టుకోవాలని కూడా కోరడం తెలిసిందే. అభివృద్ధికి, ఎదుగుదలకు నూతనత్వం ఎంతయినా కీలకమని రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ అన్నారు. వినూత్నతకు బాటలు వేయడంవల్ల నూతనత్వాన్ని తర్వాతి స్థాయికి తీసుకువెళ్తుందని, అలాగే, అందరికీ సమాన అవకాశాలకు వీలుండే ఒక వాతావరణాన్ని సృష్టిస్తుందని కూడా రాష్టప్రతి అన్నారు. (చిత్రం) రాష్టప్రతి ప్రణబ్‌కు గ్లోబల్ లీడర్ అవార్డును ప్రద్ఘానం చేస్తున్న యుసి బర్కిలీ-హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు