జాతీయ వార్తలు

అసహన ధోరణులకు తెరదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షిద్దాం
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు

న్యూఢిల్లీ,నవంబర్ 21: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, విలువలకు సవాలుగా మారుతున్న అసహనానికి తెరపడి మన నాగరికత విశిష్టతను తిరిగి గట్టిగా పరిరక్షించుకోవలసిన తరుణం ఆసన్నమయ్యిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతం ప్రాతిపదికపై దేశంలోమనుగడ సాగిస్తున్న భిన్నభిన్న సంస్కృతుల మధ్య సద్భావన, శాంతి పెరగవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇంతకు ముందెన్నడూ కనిపించని అశాంతి, ద్వేషపూరిత వాతావరణం తీవ్ర అందోళన కలిగిస్తున్నాయని శనివారం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించటానికి ఏర్పాటైన మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభిస్తూ చెప్పారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ చరిత్రకారులు, ఆధ్యాత్మిక గురువులు హాజరవుతున్న ఈ సదస్సు మూడు రోజులు జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా శాంతి, పరమత సహనం, పరస్పర అవగాహన మాయమైపోతున్నాయని రాష్టప్రతి చెప్పారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గత వైభవంపైకాక గత అనుభవాలు, ఎదురైన ఆటుపోట్లను అధిగమించిన తీరును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణకు సమావేశం పునాది వేయాలని సూచించారు. ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేయటంలో భారతీయ ఆయురేద్వం ఎదురు లేదని నిరూపించుకుందని, ఈనాటి యువత ఆయుర్వేదంపై దృష్టి సారించాలని సూచించారు. భారత దేశం ఆధునికతను తనలో ఇముడ్చుకోవటానికి వెనుకాడలేదనీ, భవిష్యత్తులో వెనుకంజవేయదన్న ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలోఒక సముచితమైన గుర్తింపు మనదేశం వల్లే లభించిందని గుర్తుచేశారు. అసహనానికి స్వస్తిచెప్పి పరస్పరం సదవగాహన సానుభూతితో సహజీవనం సాగించాలని ఆయన పిలుపిచ్చారు.
ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనంలో విశేష కృషి చేసినందుకు జర్మనీకి చెందిన ప్రొఫెసర్ హీన్‌రిచ్ ఫ్రీహెర్‌వాన్ స్టీటెన్‌క్రాన్‌కు మొట్టమొదటి అత్యుత్తమ ఇండాలజిస్టు అవార్డును ప్రదానం చేసారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద 20 వేల అమెరికన్ డాలర్ల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఈ కార్యకమంలో పాల్గొన్నారు. ** జర్మనీకి చెందిన ప్రొఫెసర్ హీన్‌రిచ్ ఫ్రీహెర్‌వాన్ స్టీటెన్‌క్రాన్‌కు మొట్టమొదటి అత్యుత్తమ ఇండాలజిస్టు అవార్డు అందిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ **