జాతీయ వార్తలు

ప్రియాంక గాంధీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీని అరెస్టు చేశారు. ఆమె సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఓ భూవివాదం కేసు సంబంధించి పదిమందిని కాల్చిన ఘటనపై ఆందోళనకు సిద్ధమయ్యారు. తొలుత ఆమె శాంతియుతంగా ధర్నా చేశారు. తరువాత నారాయణ్‌పూర్ ప్రాంతంలో ఆమెను పోలీసుల అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నలుగురితో మాట్లాడతానని చెప్పానని, కాని అనుమతించలేదని అన్నారు. బాధితుల కోసం ఎక్కడకైనా వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. కాగా సోన్‌భద్ర జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29మందిని అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.