జాతీయ వార్తలు

ప్రియాంక ఇంటి నిర్మాణంపై రాజుకున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక నిర్మిస్తున్న ఇంటిపై వివాదాలు ముసురుకుంటున్నాయి. రాష్టప్రతి వేసవి విడిదికి సమీపంలో ప్రియాంక ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని బిజెపి ఎమ్మెల్యే సురేష్ భరద్వాజ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాష్టప్రతి విడిది ఉన్నందున ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై భరద్వాజ్ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ డిజిపికి, హోం శాఖ అధికారులకు లేఖలు రాశారు. ఆ ఇంటి నిర్మాణాన్ని ఇటీవల సోనియా, ప్రియాంక స్వయంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. అన్నిరకాల అనుమతులు వచ్చాకే ఇంటి నిర్మాణం ప్రారంభించారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.