సాహితి

కరువు కోరల్లో చిక్కిన పల్లెల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

== పుస్తకమ్ ==

ఒక మేఘం కథ
కథల సంపుటి
రచయిత: సుంకోజి దేవేంద్రాచారి
ధర: రూ.120/-; పేజీలు: 189
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక దుకాణాలు.

రచయిత సుంకోజి దేవేంద్రాచారిగారు రచించిన పద్ధెనిమిది కథలు ‘ఒక మేఘం కథ’ సంపుటిలో ఉన్నవి. ఇవి గతంలో అనేక పత్రికల్లో ప్రచురింపబడినయి. చాలావరకు నేటి పల్లెవాసుల జీవన స్థితిగతులను ఆధారంగా చేసుకుని రాసిన కథలే ఇవి. వర్షాలు కురవక కరువు విలయ తాండవం చేస్తున్నందున అస్తవ్యస్తమైన వ్యవసాయదారుల వ్యథాభరిత గాథలే ఇవన్నీ.
నీటికీ, మానవ నాగరికతకూ విడదీయరాని అనుబంధం ఉంది. ప్రముఖ నగరాలు జీవ నదుల ఒడ్డున వెల్లివిరిసి తరతరాలుగా వర్ధిల్లటానికి ఇదే కారణం. గంగానది, దాని ఉప నదులూ లేకపోతే ఉత్తర భారతదేశం పెద్ద ఎడారిలా మిగిలిపోయేది. నీటి సౌకర్యం లేక కాలగర్భంలో కలిసిపోయిన మహానగరాలు చరిత్ర పుటల్లో చాలా ఉన్నాయి. అక్బరు చక్రవర్తి తనకు నచ్చిన రీతిలో అందమైన రాజధాని నగరం నిర్మించాలనుకున్నాడు. పదిహేనేళ్లు శ్రమపడి ‘్ఫతేపూర్ సిక్రీ’ని అపురూపంగా తీర్చిదిద్ది, రాజధానిని అక్కడకు మార్చాడు. సమీపంలోని కొలను ఎండిపోవటంతో, నీటి ఎద్దడి కారణంగా పదిహేనేళ్లల్లోనే తిరిగి రాజధానిని ఆగ్రా నగరానికి మార్చాడు.
ప్రస్తుతం పల్లెల ముఖ చిత్రం మారిపోయింది. ఒకనాటి పచ్చని చేలూ, తోటలూ, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన మనసులూ, అరమరికలు లేని ఆప్యాయతలూ ఇప్పుడు కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు, నేటి నీచ రాజకీయాలూ ప్రజల జీవితాలను కలుషితం చేస్తున్నాయి. కుటుంబాలతో నగరాలకు వలసపోతున్నారు. గ్రామాలు నిర్జీవంగా, నిర్జనంగా మారుతున్నాయి. దేవేంద్రాచారిగారి కథల్లో కనిపించే నేపథ్యం ఇదే.
ఇవి చిత్తూరు ప్రాంతపు మాండలికంలో రాయబడినయి. చాలామంది రచయితలు ఇప్పుడు తమ ప్రాంతపు యాసలో రాస్తున్నారు. పుట్టి పెరిగిన గడ్డమీద గల మమకారం మెచ్చుకోదగినదే గానీ, ఇందువల్ల ఇబ్బందిగూడా ఉంది. ఆ ‘యాస’తో పరిచయం లేని పాఠకులకు వీటిని చదవటం గతుకుల రోడ్డుమీద నడుస్తున్నట్లు ఉంటుంది. అంత శ్రమపడి చదివి అధ్యయనం చేయాల్సినంత గొప్ప సంగతులేవీ ఇందులో నిక్షిప్తం అయి ఉండవు గనుక, రెండు పేజీలు తిరగేసి పక్కన పడేసే అవకాశాలు ఎక్కువ.
సహజత్వం కోసం పాత్రల చేత ఆ యాసలో సంభాషణలు చెప్పించవచ్చు. కానీ ఆ సమయంలోనూ రచయిత కొంత సంయమనం చూపించాల్సి ఉంటుంది. ఆ పాత్రల చేత చెప్పే సంభాషణల్లోనయినా సరే, బూతులు రాయటం అందరికీ నచ్చకపోవచ్చు. ఈ బూతు మాటలవల్ల కథ స్థాయి దిగజారిపోయే ప్రమాదం ఉంది. (59వ పేజీ- 7, 11, 15 లైన్లు. 171 పేజీ 26వ లైను). రావిశాస్ర్తీ, తిలక్ లాంటి రచయితలు, అధోజగత్ సహోదరుల కథలు, చివరకు వేశ్యల కథలూ రాశారు. కానీ ఎక్కడా అశ్లీల పదాలు కనిపించవు. శ్రీనాథుడు లాంటి మహాకవులు ప్రబంధాలూ, కావ్యాలతోపాటు, బూతు పద్యాలూ రాసి ఉండవచ్చు. కానీ వాటి ఊసు ఎక్కడా సాహిత్యంలో కనిపించదు- పనికట్టుకుని వెతికితే తప్ప.
‘మనుషులు మరణించాక’ నిజంగా మంచి కథ. పనికోసం వలసపోతున్న రాజయ్య తన చిన్నారి కూతురిని బంధువుల ఇంట్లో ఉంచాలని ఎంత ప్రయత్నించినా ఎవరూ అంగీకరించరు. రాజయ్య కుటుంబం రైలు ప్రమాదంలో మరణిస్తుంది. రైల్వేవారు ఆ చిన్నారి పిల్లకు నష్టపరిహారం ఇవ్వదలిచినప్పుడు, ఆ పిల్ల మాది అంటే, మాది అని ఆదరం చూపిస్తారు. మానవ నైజాన్ని విశే్లషించిన ఇది మంచి కథే గాని, చివరలో నిష్కారణంగా పాఠకుల మీద అక్కసు వెళ్లగక్కటం ఏమిటో అర్థంకాదు. వర్షాల కోసం అప్పులుచేసి జాతర చేయటం- వలస దేవర కథ. పెళ్లి సమయంలో భర్త తన పేరు మార్చటం నచ్చని ‘సొప్న’ భర్త చనిపోగానే తన పాత పేరునే ఎంచుకుని అందుకు పేపరులో ‘ప్రకటన’ ఇవ్వటం మరో కథ. చిన్నప్పుడు ఎప్పుడో తిన్న ‘పూరేడుకూర’ జ్ఞాపకాలను తిరగతోడుకోవటం ఇంకో కథ. కొత్తగా పెళ్లిచేసుకున్న ఒక చిరుద్యోగి సాధక బాధకాలే ‘పెళ్లికళ’. ఒక బంధువు అంత్యక్రియలకు వెళ్తే, అక్కడంతా ఎన్నికల రాద్ధాంతాల గురించే చర్చించటం ‘అంత్యక్రియలు’లోని కథాంశం. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకునీ, కోడలును విడదీయాలని విడాకులు ఇప్పించినా, వాళ్లు కల్సి ఉండటం ఇల్లీగల్ లవ్ స్టోరీ. పెద్దకొడుకు దగ్గర ఉంటే చిన్నకొడుకు మీద, చిన్న కొడుకు దగ్గర ఉంటే పెద్దకొడుకు మీద మనసు లగ్నం కావటం ఒక మేఘం కథ. రోడ్డు వెడల్పు చేయటం కోసం ఒక చెట్టు కొట్టేయటం ‘యిరుకుమాను’ ఇతివృత్తం. గ్యాస్ కనెక్షన్ కోసం పడ్డ కష్టాలు ‘దీపం పురుగులు’, పల్లెటూరి వర్ణన దాహం. భర్తచేత అనుమానానికి గురవుతున్న భార్య ‘రాజమ్మ’.
వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పైకి తీసుకురావాలనుకోవటం ‘చెనిక్కాయలు’ కథ. తనను వేధించిన మేస్ర్తిని చెప్పుతో కొట్టిన ఒక కూలీ కథ ‘పరువు’. ఆడాళ్లపిచ్చి ఉన్న మొగుడి కథ ‘బహుమతి’. పల్లెల్లో రాజకీయాలతో వస్తున్న మార్పు ‘చెదిరిన బింబం’. పార్క్‌లో తిరుగుతూ పురుషుల్ని ఆకర్షిస్తున్న అమ్మాయి కథ ‘చీకటి.’ తరాల మధ్యనున్న అంతరం కథ ఆకుపచ్చని లోకంలోకి...’ కథ.

- శ్రీధర, 9959556876