జాతీయ వార్తలు

పీవీ సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. అద్భుతమైన పాలనాదక్షతతో తనదైన ముద్ర వేశారని మోదీ ట్వీట్ చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని, ఆయన చిరస్మరణీయుడని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అంటూ ట్వీట్ చేశారు. మాజీ గవర్నర్ రోశయ్య, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ఆయన హయాంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య, పలువురు కాంగ్రెస్ నేతలు పీవీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.