జాతీయ వార్తలు

రాహుల్‌ని మళ్లీ ఎన్నుకుంటే మోదీకి అస్త్రం అందించినట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని మలయాళీ ప్రజలు మళ్లీ ఎన్నుకుంటే ఘోరమైన తప్పు చేసినట్లేనని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. ఆయన ‘లిటరేచరీ ఫెస్టివల్‌లో జరిగిన ‘దేశభక్తి వర్సెస్ యుద్ధోన్మాదం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కుటుంబ వారసత్వ రాజకీయాల ద్వారా వచ్చిన రాహుల్ వంటి ఐదోతరం నాయకుల వల్ల బీజేపీ బలపడతుందన్నారు. కష్టపడి పనిచేసే, స్వయంకృషితో ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీపై ఐదవ తరం నాయకుడు అయిన రాహుల్‌గాంధీ గెలిచే అవకాశం లేదని కూడా అన్నారు. రాహుల్ గాంధీ అంటే తనకెంతో అభిమానం అని, ఆయ‌నో మంచి వ్య‌క్తి, అని, 2024లో రాహుల్‌కు ఓటేస్తే.. అప్పుడు అది మోదీకి అడ్వాంటేజ్‌గా మారుతుంద‌ని, తెలిపారు. ఇటీవ‌ల పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా బెంగుళూరులో రామ‌చంద్ర గుహ ధ‌ర్నా చేశారు. అప్పుడు ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.