జాతీయ వార్తలు

రాజీవ్ హంతకులపై కేంద్రానిదే నిర్ణయం: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దివంగత మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసే విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయమని, ఈ అంశంపై తానేమీ మాట్లాడలేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. రాజీవ్ హంతకులు పాతికేళ్లుగా జైలులో ఉన్నందున వారిని విడుదల చేసే విషయంలో తుది నిర్ణయం చెప్పాలంటూ తమిళనాడు హోం శాఖ కార్యదర్శి కేంద్ర హోం శాఖకు తాజాగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు రాహుల్ నిరాకరించారు. తమ నిర్ణయానికి కేంద్ర హోం శాఖ ఆమోదముద్ర వేస్తే రాజీవ్ హంతకులు విడుదల చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ లేఖపై కేంద్ర హోం శాఖ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.