జాతీయ వార్తలు

రఫేల్‌పై కేంద్రం సమాధానం చెప్పితీరాలి:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై పీఎంఓ, రక్షణ మంత్రత్వ శాఖ జోక్యం ఉందని ఆరోపించారు. తాము గత ఏడాది కాలంగా దీనిపై మాట్లాడుతున్నా మోదీ, రక్షణ శాఖ మంత్రి విశ్వాసంగా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని అన్నారు. రక్షణ శాఖను కాదని పీఎంఓ నేరుగా ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిందని, ఈ చర్చలు మీ కోసమో నాకోసమో కాదు అనిల్ అంబానీ కోసం అని విమర్శించారు. దీనిపై రక్షణశాఖ అభ్యంతరం చెప్పినట్లు తాజా నివేదిక వెల్లడించిందని ఆయన అన్నారు. దాదాపు 30 వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీకి దోచిపెట్టారని అన్నారు.