జాతీయ వార్తలు

రాహుల్ పౌరసత్వంపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: బ్రిటిష్ పౌరుడినని చెప్పుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఒక సంస్థ ఏర్పాటుకు సంబంధించి రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడినని ఆ సంస్థ న్యాయాధికారుల ఎదుట చెప్పినట్లు బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి ఇటీవల ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎంఎల్.శర్మ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే ఈ వ్యాజ్యంతో దాఖలు చేసిన పత్రాలను ఏవిధంగా సంపాదించారు? ఆ పత్రాల్లో వాస్తవం ఎంత? అని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్.దత్తు, జస్టిస్ అమితావ్ రాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అడ్డదిడ్డమైన ప్రశ్నలతో మేము దీనిపై విచారణ ప్రారంభించాలా అని ధర్మాసనం నిలదీస్తూ పసలేని ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.