జాతీయ వార్తలు

ఆరెస్సెస్‌ కేసు ఎదుర్కోవడానికి సిద్ధం: రాహుల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) వేసిన పరువు నష్టం దావాపై విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం సుప్రీంకోర్టులో వెల్లడించారు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణం కాదని రాహుల్‌ చెప్తే కేసు వెనక్కి తీసుకుంటామని ఆరెస్సెస్‌ గతంలోనే వెల్లడించింది. అయితే, రాహుల్‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమంటూ రాహుల్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ ఆరెస్సెస్‌ రాహుల్‌పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాను ఆరెస్సెస్‌ సంస్థ మొత్తాన్ని అనలేదని, ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తి వల్ల గాంధీ హత్య జరిగిందని అన్నానని రాహుల్‌ చెప్తున్నారు. విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ తన లాయర్‌ కపిల్‌ సిబల్‌ ద్వారా కోర్టుకు తెలిపారు. కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు రాహుల్‌ వెల్లడించారు.