జాతీయ వార్తలు

పొంచి ఉన్నభారీ వర్షాల గండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. కనీసం 13 రాష్ర్టాలకు, రెండు కేంద్ర పాలితప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను, భారీ వర్షాల గండం పొంచి ఉన్నదని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఢిల్లీ, చండీగఢ్ చుట్టపక్కల ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లో సోమవారం భారీ వర్షాలు కురువవచ్చని పేర్కొన్నది. వీటితోపాటు యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా హెచ్చరికల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం 7, 8 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.