జాతీయ వార్తలు

తమిళనాడులో రెడ్ అలెర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా వర్షాలకు పాఠశాలల్లోకి నీళ్లు ప్రవేశించటంతో చెన్నై నగర విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చెన్నై, పొరుగు జిల్లాలతోపాటు దక్షిణాది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తం గా భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తేని, దిండుగల్‌, నీలగిరి, కోవై జిల్లాల్లో మంగళవారం వేకువజామున నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లోను రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రెడ్‌ అలర్ట్‌ కారణంగా కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రదేశాలను రెండురోజులపాటు మూపివేయనున్నట్టు అధికారులు తెలిపారు.