జాతీయ వార్తలు

తేజాస్‌లో ప్రయాణించిన రాజ్‌నాథ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఆయన తేజాస్ యుద్ధ విమానాన్ని నడిపారు. బెంగుళూరులోని హచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి ఆయన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విహరించారు. పైలట్ వెనుక కూర్చుని ఆయన తేజాస్‌లో విహరించారు. మధ్యలో ఒకసారి యుద్ధ విమానాన్ని నియంత్రించారు. దాదాపు రెండు నిమిషాల పాటు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ తేజాస్‌ను నియంత్రిస్తూ నడిపారని డీఆర్‌డీఓ చీఫ్ సతీష్‌రెడ్డి తెలిపారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ తేజాస్‌లో ప్రయాణించటం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు. ఆ రెండు నిమిషాల ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ప్ర‌పంచ‌దేశాల‌కు ఫైట‌ర్ విమానాల‌ను ఎగుమ‌తి చేసే స్థాయికి చేరుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఎల్‌సీఏ తేజ‌స్ ఫ్ల‌యింగ్ క్వాలిటీపై రాజ్‌నాథ్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.