సాహితి

రంగుల ప్రేమికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు చూసాడో
ఎలా తీసాడో
తెలియదు

సాయంత్రం
ఇంటికి వచ్చేసరికి
దేహ కాన్వాసు
దాచివున్న కాగితాలు
తను రంగరించిన రంగులతో
మెరిసిపోతుంటాయి

ఇష్టమైన తినుబండారాల్ని తింటూ
ఒళ్ళంతా పులుముకున్నట్టు
మోహించిన రంగుల్ని
శరీరంపై హత్తుకుని
వాటినే
కాగితంపై అలుముతాడు

ఒక్కోసారి
చిన్న పికాసోలా మారి
వర్ణాలను చూసి
మురిసిపోతాడు

వాడు
నడిచినంత మేరా
ఇంద్రధనస్సును
నేలపై సృష్టిస్తాడు
ఆ మాంత్రికుడు
నా రంగుల ప్రేమికుడు

- ఎం.వి.రామశాస్ర్తీ