జాతీయ వార్తలు

పైసా కట్టను.. అరెస్టు అవుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై రవిశంకర్ ఎలాంటి ఉల్లంఘనకూ పాల్పడలేదని ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 10: యమునానది తీరాన సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణ విషయంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ సమ్మేళనం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జిటి) తమపై విధించిన ఐదు కోట్ల రూపాయలు చెల్లించే ప్రసక్తిలేదని జైలుకైనా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ‘మేం ఏ తప్పూచేయలేదు. మామీద ఎలాంటి మచ్చలేదు. అలాంటప్పుడు జరిమానా ఎందుకు చెల్లించాలి. జైలుకైనా సిద్ధం’అని గురువారం ఆయన ప్రకటించారు. యమునానది వరద పరివాహక ప్రాంతంలో సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించడం వల్ల పర్యావరణానికి ముప్పువాటిల్లుతోందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వాదిస్తోంది. ఈ మేరకు మూడు రోజులు నిర్వహించతలపెట్టిన సమ్మేళనానికి 5 కోట్ల రూపాయల జరిమానా విధించాల్సిందిగా బుధవారం ఎన్‌జిటి ఆదేశించింది. దీనిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్వీట్ చేస్తూ ఎన్‌జిటి తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాంస్కృతిక సమ్మేళనాన్ని రాజకీయం చేయొద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. కార్యక్రమం జరిగే ప్రాంతంలో తాము ఒక్క చెట్టునైనా తొలగించలేదని. కేవలం మూడింటి కొమ్మలు మాత్రం కత్తిరించినట్టు రవిశంకర్ స్పష్టం చేశారు. తాము నిర్వహించనున్న ఈ కార్యక్రమం సాంస్కృతిక ఒలింపిక్స్ వంటిదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధులైన 37000 మంది కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శనలు ఇస్తారని వెల్లడించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారనే విశ్వాసాన్ని రవిశంకర్ వ్యక్తం చేశారు.
మేం జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు
యమునానది ఒడ్డున మూడు రోజులపాటు జరగనున్న సాంస్కృతిక సమ్మేళనాన్ని నిలిపివేయించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సారధ్యంలో ఈ సమ్మేళనం జరగనుంది. శుక్రవారం ప్రారంభకానున్న సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయిన ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జిటి)ని ఆశ్రయించమని పిటిషనర్‌కు సూచించింది. భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘సమ్మేళనానికి ఎప్పటి నుంచో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏం చేశారు?.ఎన్‌జిటిని ఎందుకు ఆశ్రయించలేదు?’అని బెంచ్ ప్రశ్నించింది. ఆఖరి నిముషంలో సుప్రీం కోర్టుకు రావడాన్ని ప్రశ్నించిన సుప్రీం ‘ప్రచారం ఆర్భాటం కోసమా?అంటూ వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులూ లేకుండానే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలెట్టేసిందని పిటిషనర్ ఆరోపించారు.