జాతీయ వార్తలు

పనామా పేపర్స్‌పై నిజానిజాలు నిగ్గుతేలాలి: రాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత్‌కు చెందిన సుమారు 500 మంది ప్రముఖులు పన్నులు ఎగవేసి విదేశాల్లో భారీగా నల్లధనం దాచుకున్నారన్న పనామా పత్రాల పరిశోధనలో నిజానిజాలు వెల్లడి కావల్సి ఉందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం మీడియాతో చెప్పారు. పనామా పేపర్స్ లీకేజీపై సమగ్ర విచారణకు ఇప్పటికే కేంద్రం వివిధ ఏజెన్సీలతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఆ బృందంలో ఆర్‌బిఐ కూడా ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో డబ్బును దాచుకునే వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు. విచారణ జరిగితే తప్ప ఈ విషయమై ఏదీ స్పష్టంగా చెప్పలేమన్నారు.