జాతీయ వార్తలు

మధ్యాహ్న భోజనం: కూరకు బదులు ఉప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: చదువుకునే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనంలో కూర,పప్పు, అరటిపండు, గుడ్డు ఉండేటట్లు మెను కూడా తయారుచేసి అమలుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో మాత్రం కూరకు బదులు ఉప్పును అందిస్తున్నారు. అన్నం పెడితే అందులో ఉప్పు కలుపుకుని తినాలి. అలాగే రొట్టెలు ఇస్తే ఉప్పు అంటించుకుని తినాలి. ఇలా గత సంవత్సర కాలం నుంచి జరుగుతుంది. పిల్లలు ఉప్పు అద్దుకుని రొట్టెలు తింటున్న ఫొటోలను ఓ జర్నలిస్ట్ సామాజికమాధ్యమాల్లో పోస్ట్ చేయటంత విద్యార్థుల దయనీయ స్థితి బయటపడింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి ప్రధానోపాధ్యాయుడు, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు.