హైదరాబాద్

అనాలోచిత ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: అసలే మహానగరం..రోజురోజుకి పెరుగుతున్న పట్టణీకరణ, దానికి తగ్గట్టు అధికమవుతున్న వాహనాల రద్దీ..ఇరుకురోడ్లు, పైగా ఎక్కడబడితే అక్కడ అక్రమ పార్కింగ్‌లు..కారణంగా వాహనదారులకు రోజురోజుకి ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. వీటిని కొంతమేరకైనా తగ్గించే దిశగా చర్యలు చేపట్టడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. నిత్యం రద్ధీగా ఉండే ప్రాంతాలతో పాటు మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించటం మాట దేవుడెరుగు కానీ అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇలాంటి ఆంక్షల అమలు కారణంగానే సికిందరాబాద్ పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే బైబిల్ హౌజ్ చౌరస్తా నుంచి ప్యాట్నీ ప్రయాణించాలంటే వాహనదారులు చుక్కలు చూడాల్సిందే! ఇదివరకు కాస్త స్వల్ప ట్రాఫిక్ కష్టాలతో ప్రయాణించే వాహనదారులకు అధికారుల అనాలోచిత ఆంక్షలు మరింత ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. బైబిల్ హౌజ్ సిగ్నల్ నుంచి రైల్వే బ్రిడ్జి కింది నుంచి సిటీలైట్ హోటల్ వరకు మాత్రమే గతంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేది. కానీ ఇపుడు బైబిల్ హౌజ్ చౌరస్తా నుంచి సిటీలైట్, బాటా, ప్యాట్నీ జంక్షన్లలో కూడా సమస్య అధికమైంది. ఇందుకు సిటీలైట్ సెంటర్ నుంచి ప్యాట్నీ చౌరస్తా వరకు పోలీసులు బాటా చౌరస్తా సిగ్నల్‌ను మూసివేసి, ఆ మార్గంలోని అమ్మవారి గుడి ముందు, కాస్త ముందుకెళ్లిన తర్వాత పెట్రోలు బంకు ముందు మహాబూబియా కాలేజీకి సమీపంలో మూడు యూ టర్న్‌లు ఇవ్వటంతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా సిటీలైట్ జంక్షన్ నుంచి ప్యాట్నీ వరకు ప్రయాణించేందుకు సుమారు అరగంట సమయం పడుతోంది. అంతేగాక, సిటీలైట్ హోటల్ వద్ద సిగ్నల్ పడగానే వేగంగా దూసుకువచ్చే వాహనాలకు శ్రీ మావురాల పెద్దమ్మ దేవాలయం వద్దనున్న యూటర్న్ కారణంగా ఒక్కసారిగా బ్రేక్‌లు పడుతున్నాయి. అక్కడి నుంచి ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతూ, ఎడమవైపున్న పెట్రోలు బంక్ ముందు, ఆ తర్వాత ఆంధ్రాబ్యాంకు ఏటిఎం ముందు యూ టర్న్‌లు ఉండటంతో ట్రాఫిక్ మొత్తం గందరగోళంగా తయారైంది. సాధారణంగా ఏమైనా భారీ ఊరేగింపులు, పండుగలు జరిగినపుడు ఈ రకంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తుంటారే తప్ప, స్వల్ప ఇబ్బందులతో ట్రాఫిక్ సజావుగా సాగే ఈ రహదారిలో తాజాగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇబ్బందులు అధిగమయ్యాయని వాహనదారులు వాపోతున్నారు.