హైదరాబాద్

బోగస్ టీచర్లపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూలై 19: బోగస్ టీచర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పరిగి డివిజన్ కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం పరిగిలో బోగస్ టీచర్లను తొలిగించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బోగస్ టీచర్ల అంశంపై గత 16నెలలుగా చర్చ జరుగుతోందన్నారు. సమాచార చట్టం ప్రకారం దొడ్డికాడి గోపాల్ సమాచారం సేకరించి జిల్లాకలెక్టర్‌కు, డైరెక్టర్ ఆఫ్‌స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌కు సమాచారం ఇచ్చాడని తెలిపారు. అయినా అధికారులు ఇప్పటివరకుఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆర్‌టిఐ కింద వివరాలను అడిగిన వ్యక్తి పేరును బయటికి చెప్పిన, అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టిన గండ్వీడ్ ఎంఇఓపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశారు. వివరాలు అడిగిన గోపాల్‌పై అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ టీచర్ల వివరాలను బయటికి తీసుకు వచ్చిన గోపాల్‌కు ప్రాణ భయం ఉందని, అతడికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పరిగి నియోజకవర్గంలోని విద్యార్థి, యువజన, నిరద్యోగ, న్యాయవాదులు, వికలాంగులు, దళిత సంఘాల ఆద్వర్యంలో ఈనెల 26న పరిగిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చామని, దీనికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగవర్దన్, శ్రీనివాస్, గోపాల్, మాధవి, అరుణ, రేణుక, సంజీవ్ పాల్గొన్నారు.