హైదరాబాద్

కిటకిటలాడిన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూలై 19: గురుపౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాలలో భక్తులు అధిక సఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయప్రాంగణంలో చక్కటి ఏర్పాట్లను చేశారు. వనస్థలిరం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు.
పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి హాజరై బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోచబోయిని ఈశ్వరమ్మ యాదవ్, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ చైర్మన్ రూపేందర్‌నాథ్, గంగాధర్‌రావు, కాలనీ అధ్యక్షుడు గుర్రం గోపాల్ రెడ్డి, ఝాన్సీలక్ష్మి బాయి, సీతారాంరెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పాతగ్రామం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అమర్‌గౌడ్, జగదీష్‌గౌడ్, పాతూరి శ్రీధర్ గౌడ్, సిహెచ్.నవీన్ జెట్టి, అశోక్ యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పి.చంద్రుడు గౌడ్, పోచబోయిని గణేష్ యాదవ్, టిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు జగదీష్ యాదవ్. ఈశ్వర్,కె.జగదీష్ పాల్గొన్నారు.
శ్రీరాం నగర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఆలయకమిటీ చైర్మన్ కొప్పుల నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేడుకలో కాలనీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సత్తయ్య, సాయినాథ్, లక్ష్మారెడ్డి, రాజశేఖర్,కె.వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిఎన్ రెడ్డినగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయకమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా పూజలు
నేరేడ్‌మెట్: గురుపూర్ణిమ సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్, వౌలాలి, ఆనంద్‌బాగ్, వసంతపురికాలనీ, కేశవనగర్, డిఫెన్స్‌కాలనీ, సాయినాథపురం, జెజెనగర్, సఫిల్‌గూడ, వినాయకనగర్ ప్రాంతాలలో ఆలయాలు తెల్లవారుజామునుండి భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహిళలు ఆలయాల వద్ద పెద్దసంఖ్యలో బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.