హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, జూలై 19:ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని బడంగ్‌పేట్ టౌన్ ప్లానింగ్ అధికారి టిహెచ్.విజయశ్రీ హెచ్చరించారు. మంగళవారం బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ మాట్లాడుతూ..కమిషనర్ వసంత ఆదేశాల మేరకు బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని మల్లాపూర్, సుల్తాన్ పూర్ ఏరియాలోని ద్వారకాహోమ్ కాలనీ, గోల్డెన్ విల్లాస్, వెంకటాపూర్ వీకర్ సెక్షన్, నాదర్‌గూల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన గల ఆక్రమ నిర్మాణాలను తొలగించినట్టు చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆర్. సత్యనారాయణ రెడ్డి, అంజయ్య, వెంకటాపూర్ బిల్‌కలెక్టర్ ఎస్.సాయి రామ్ పాల్గొన్నారు.