హైదరాబాద్

ఉపాధి అవకాశాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, అక్టోబర్ 20: నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ‘కనేక్ట్ ది డాస్ట్’ సంస్థ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిఎస్సీ, బికాం, బిఏ, ఎంబిఎ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్వ్యూలో సక్సెస్ అయి, ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చాల మంది విద్యార్థులు ఇంటర్వ్యూలో సక్రమంగా చేయకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఇంటర్వ్యూలో సక్సెస్ కోసం ఉచితంగా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు లక్డికపూల్ లోటస్ ఆసుపత్రి సమీపంలోని నాలుగోవ ఫ్లోర్ 418లో సంప్రదించలని అన్నారు. వివరాలకు 040-42038021, 9177752195 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
దొరల పాలనపై ఉద్యమించండి
మోమిన్‌పేట, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో పేదోడి సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం దొరల పాలన కొనసాగిస్తుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఏజెఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో బిసిల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం బిసి కులాలను, జెండాలను మోయడానికి మాత్రమే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. బిసిలకు 119 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. కార్యక్రమంలో బిసి సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్, అంజి, మాజీ ఎంపిపి ఒగ్గు మల్లయ్య, మాజీ సర్పంచ్ కె.మల్లయ్య, మోహన్ యాదవ్ పాల్గొన్నారు.