జాతీయ వార్తలు

వర్శిటీల్లో దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు * అఖిల భారత ప్రతినిధుల సభ ప్రారంభం
నాగౌర్, మార్చి 11: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం ( జెఎన్‌యు)లో దేశ వ్యతిరేక నినాదాలు చేయడాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్రంగా ఖండిస్తూ, చాలాకాలంగా విచ్ఛిన్నకర శక్తులు తమ కార్యకలాపాలకు యూనివర్శిటీలను కేంద్రాలుగా చేసుకుంటున్నాయని, ప్రభుత్వాలు వాటిని అదుపు చేయాలని డిమాండ్ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకులు శుక్రవారంనుంచి మూడు రోజుల పాటు జరిగే మేధోమథన సదస్సు కోసం రాజస్థాన్‌లోని నాగౌర్‌లో సమావేశమైన సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది.
మాల్డా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ హింసాత్మక ఘటనలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు రాజకీయ పార్టీలు తమ బుజ్జగింపు విధానాలను వదిలిపెట్టాలని, ఇలాంటి సంఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విచ్ఛిన్నకర, సంఘ వ్యతిరేక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయని, మన విద్యా సంస్థలను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారకుండా చేయడం ద్వారా వాటి పవిత్రతను, సాంస్కృతిక వాతావరణాన్ని కాపాడుతాయని తాము ఆశిస్తున్నామని ఇక్కడ ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశంలో సమర్పించిన వార్షిక నివేదికలో ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయ పడింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం విద్యావిధానం, కుల ఆధారిత వివక్షను నిర్మూలించడం, లాంటి అంశాలపైన దృష్టి పెడుతుందని, మారిన కాలానికి అనుగుణంగా తమ సభ్యుల యూని ఫామ్‌ను మార్చడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. దేశంలో అసహనం పెరిగిపోవడంపై చర్చ జరుగుతున్న తరుణంలో బిజెపికి సైద్ధాంతిక మార్గదర్శి అయిన ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం ప్రారంభంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
‘కొన్ని యూనివర్శిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి పత్రికల్లో వస్తున్న వార్తలు దేశభక్తులైన వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశాన్ని ముక్కలు చేయాలని పిలుపునిచ్చే నినాదాలను ఎలా సహిస్తారు? అలాగే పార్లమెంటును పేల్చివేయడానికి కుట్ర పన్నిన దోషిని అమరవీరుడిలాగా గౌరవించడాన్ని ఎలా సహిస్తారు’ అని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహక్ సురేశ్ జోషీ సమర్పించిన ఆ నివేదిక పేర్కొంది. అలాంటి పనులు చేస్తున్న వారికి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, పార్లమెంటుపై విశ్వాసం లేదని, అలాంటి విచ్ఛిన్నకర శక్తులు చాలాకాలంగా యూనివర్శిటీలను తమ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాయని ఆన్‌ఎస్‌ఎస్ పేర్కొంది. అలాంటి సంఘ వ్యతిరేక శక్తులకు కొన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించినప్పుడు దేశ భక్తుల ఆందోళన కూడా మరింత పెరుగుతుందని ఆ నివేదిక తెలిపింది.