Others
నిదుర పట్టని రాత్రి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 March 2018
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి

నేను మోయలేను
ఈ నిదురపట్టని రాత్రిని
ఇది భూగోళం కంటే భారమైంది!
మెలుకువ ఎంతున్నా
చీకటిని జయించలేని స్థితి
క్షణమొక పెనుభారం!
అందరూ నిద్రలో
తరిస్తుంటే...
ఆ అనీజీనెస్ అనుభవించాల్సిందే!
దాచుకున్న దుఃఖం చేసే గాయం
కత్తికి కాదు
కన్నీళ్ళకు తెలుసు!
ఓదార్చడానికి
ఆ రాత్రి ఎవరిని ఆశ్రయిస్తాం
ఒక వేకువ రెక్కలు తొడగాల్సిందే!
ఈ స్థితి
నా ఒక్కడిదేనా?
అనాదిగా ఎందరిని ఎన్నిసార్లు పీడించిందో!
లేస్తూ లేస్తూ
కళ్ళు తుడుచుకుంటూ కన్నీళ్ళను
అమ్మా నాన్నలు ఎన్నిసార్లు దాచారో!
దుఃఖమూ అంతే
మోయలేనిదే అయినా
వ్యవధితో మనసును శుభ్రం చేస్తుంది!!