విశాఖ

పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సి.ఐ.టి.యు. డివిజన్ కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు కోరారు. అరకులోయ పట్టణంలోని పెదలబుడు పంచాయతీ కార్యాలయం ఎదుట కనీస వేతనాలు చెల్లించకపోవడంపై సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేసారు. సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో గిరిజన పారిశుధ్య కార్మికులు ప్రధాన రహదారి వద్ద ధర్నా చేపట్టి నినాదాలు చేసి పంచాయతీ పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల ప్రకారం పారిశుధ్య కార్మికులకు నెలకు 18 వందల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఆదాయంలో 50 శాతం నిధులను కార్మికులకు వేతనాలుగా చెల్లించాల్సి ఉన్నప్పటికీ దీనిని అమలు చేయడం లేదని ఆయన అన్నారు. గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులే పట్టణ వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికీ కార్మికుల సంఖ్య పెంచకపోవడమే కాకుండా వారికి వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన పంచాయతీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చాలీ చాలని వేతనాలతో వారు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి దత్తత పంచాయతీలో కార్మిక చట్టం అమలు కాకపోవడం అన్యాయమని ఆయన చెప్పారు. కార్మిక చట్టాన్ని అమలు చేసి కనీస వేతనాలు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమామహేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

12.50 లక్షలతో కోనేరు అభివృద్ది పనులు

కోటవురట్ల, ఫిబ్రవరి 5: మండలంలో జల్లూరులో గౌరీపరమేశ్వరుల కోనేరు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈకోనేరు అభివృద్ధికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి 10 లక్షలు, స్థానిక పంచాయతీ నుంచి 1.50 లక్షలు, ఎం.పి.టి.సి. నిధుల నుంచి లక్ష రూపాయలు మొత్తం 12.50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ది పనుల్లో భాగంగా కోనేరు చుట్టూ 280 మీటర్ల సి.సి. రోడ్డును నిర్మించారు. అలాగే కోనేరు రేవు వద్ద టైల్స్‌తో మెట్లను నిర్మిస్తున్నారు. దీని చుట్టూ పెన్షింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రక్షణగా ఇనుప గేట్లును అమర్చుతున్నారు. అప్రోచ్‌రోడ్డును కూడా నియమిస్తున్నారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ లాలం పద్మావతి, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ , మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు మాట్లాడుతూ పూర్వం ఈకోనేరులో గౌరీపరమేశ్వరుల నిమజ్జనం అతివైభవంగా జరిగేదన్నారు. అయితే తరువాత ఈ కోనేరు నిర్లక్ష్యంగా చేయడంతో బహిర్భూమికి వాడుకునేవారన్నారు. కొందరు ఆకతాయిలు రాత్రివేళ్ళల్లో కోనేటి గట్టుపై మద్యం సేవించి సీసాలు అక్కడే వదిలివేయడంతో అటుగా వెళ్ళే వారికి కాళ్ళకు గుచ్చుకుని గాయాలపాలయ్యేవారన్నారు. కోనేరు వద్ద ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 7న ప్రారంభమయ్యే గౌరీపరమేశ్వరుల ఉత్సవానికి కోనేరును సిద్ధం చేస్తున్నామన్నారు. కొత్తగా తయారు చేయించిన రధంపై గౌరీపరమేశ్వరులను ఊరేగించి ఈనెల 9 ఉదయం కోనేరులో నిమజ్జనం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అర్. అండ్.బి .మంత్రి అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత పాల్గొంటారని తెలిపారు.

పలు గ్రామాల్లో ఘనంగా అడవిరాజులబాబు పండుగ
కోటవురట్ల, ఫిబ్రవరి 5: మండలంలో అన్నవరం, సుంకపూర్, గొల్లపేట గ్రామాల్లో అడవిరాజులబాబు పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు క్యూలో నిల్చుని అడవిరాజులబాబును దర్శించుకుని తీర్ధ ఫ్రసాదాలు స్వీకరించారు. అన్నవరం గ్రామంలో ఎం.పి.పి. వరహాలమ్మ, రాజులనాయుడు దంపతులు అడవిరాజులబాబును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎం.పి.పి. మాట్లాడుతూ రైతులు ప్రతీ ఏటా శివరాత్రి ముందు వచ్చే మాఘమాసంలో సాంప్రదాయ బద్దంగా రైతులు ఈపండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రైతులు, కూలీల పండుగగా పేర్కొన్నారు. అన్నవరంలో అడవిరాజులబాబు ఆలయాన్ని విరాళాలుగా వచ్చిన రెండు లక్షల రూపాయలతో మాజీ సర్పంచ్ రాజులనాయుడు అబివృద్ది చేస్తున్నారని తెలిపారు.

పంటసంజీవిని రెండు నెలల్లో పూర్తి చేయాలి
కొయ్యూరు, ఫిబ్రవరి 5: అసంపూర్తిగా ఉన్న పంట సంజీవిని పనులను రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి పథక ఎ.పి.డి. లచ్చన్న సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలానికి వచ్చిన ఆయన పథక సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫ్రతీ మండలంలో 250 చొప్పున పంట సంజీవిని పనులను గత ఏడాదిలో మంజూరు చేయగా జరుగుతున్నాయన్నారు. స్మశాన వాటికలకు రహదారులు, చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాల పనులను సత్వరమే పూర్తి చేయించాలని ఆదేశించారు. కూలీలకు సరిపడే పనులను గుర్తించాలన్నారు. మొక్కలు, కందకాలు, నీటికుంటల పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి పథకం ద్వారా మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. ఈకార్యక్రమంలో చింతపల్లి ఎ.పి.డి. రవీంధ్రనాధ్, ఎ.పి. ఓ. కొండబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

డివిజన్‌లో 110 కోట్లతో వివిధ అబివృద్ధి పనులు

కొయ్యూరు, ఫిబ్రవరి 5: పాడేరు డివిజన్ 11 మండలాల్లో 110 కోట్లతో 744 పనులను వేగవంతంగా జరుగుతున్నట్లు ఆర్.డబ్ల్యు. ఎస్. ఇ. ఇ.రామ్‌ప్రసాద్ తెలిపారు. సోమవారం మండలంలోని కొప్పికొండ, నల్లగొండ, కినపర్తి, వల్సంపేట తదితర గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న తాగునీటి పథకాలను పరిశీలించారు. వీటిపై సిబ్బందికి తగు సూచనలు అందజేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మన్యంలో 800 గ్రామాల్లో ఏవిధమైన నీటి వనరులు లేనట్లు గుర్తించామన్నారు. అలాగే వెయ్యి గ్రామాల్లో ఒక్కొక్క బోరు మాత్రమే ఉన్నాయన్నారు. ఏమీ లేని చోట రెండు, ఒక బోరు ఉన్న చోట మరోక బోరు ఏర్పాటు చేసేందుకు 2,600 బోర్లు మంజూరయ్యాయన్నారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీలుగా ఒక్కొక్క మండలానికి ఆరు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే సామగ్రి తీసుకువెళ్ళి మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్.డబ్ల్యు. ఎస్. పథకంలో 76 కోట్లతో మంజూరైన 465 పనులు, టి. ఎస్.వి. నిధులు 33 కోట్లతో మంజూరైన 279 పనులు సాగుతున్నాయన్నారు. 54 చోట్ల సోలార్ మోటార్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. డివిజన్‌లో 75 వేల మరుగుదొడ్లు మంజూరు కాగా 40 శాతం పూర్తయ్యాయని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో డి. ఇ. రమణ, ఎ. ఇ.విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.