విశాఖ

నేడు పార్లమెంట్‌లో ఎంపీల తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 16: జిల్లాకు చెందిన మూడు పార్లమెంటరీ స్థానాలకు ఇటీవల ఎంపీలుగా ఎన్నికైన వారు సోమవారం తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. అనకాపల్లి నుండి బి సత్యవతి, అరకు నుండి గొడ్డేటి మాదవీ, విశాఖపట్నం నుండి ఎంవివి సత్యనారాయణలు పార్లమెంట్ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరంతా తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగెడుతున్నవారే కావడం విశేషం. అనకాపల్లి పార్లమెంట్ చరిత్రలోనే ఒక మహిళా పార్లమెంట్ సభ్యురాలిగా బివి సత్యవతి, లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అరకు పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో కొత్తపల్లి గీత ఎంపీగా ఎన్నిక కాగా ఈ ఎన్నికల్లో అదే పార్లమెంట్ నుండి ఎన్నికైన రెండవ మహిళగా గొడ్డేటి మాదవీ పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన విశాఖ పార్లమెంట్ నుండి వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఎంవివి సత్యనారాయణ తొలిసారిగా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో అరకు ఎంపీ గొడ్డేటి మాదవికి రాజకీయ నేపధ్యం ఉంది. ఆమె తండ్రి దేముడు చింతపల్లి అసెంబ్లీ నుండి సీపీఐ తరపున శాసనసభ్యునిగా పనిచేసిన గుర్తింపును పొందారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి ప్రముఖ గైనకాలజిస్టుగా పేరుంది. 2014 ఎన్నికల సమయంలో దేశం పార్టీలో చేరి ఆపార్టీలో చురుకైన పాత్ర వహించారు. ఎన్నికల నామినేషన్ ఘట్టం ప్రారంభం సందర్భంలో పార్టీలో చేరకుండానే అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ను దక్కించుకున్న ఘనతను డాక్టర్ సత్యవతి దక్కించుకున్నారు. ఆ విధంగా జిల్లాకు చెందిన మూడు పార్లమెంట్ స్థానాల నుండి ఎంపీలుగా ఎన్నికైన వారు పార్లమెంట్‌లో అడుగెట్టి ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.