శ్రీకాకుళం

నేడు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 7: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌరులు నిరసన గళం వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర మంత్రి అరుణ్ జట్లీ బడ్జెట్ తీరు ఉందంటూ జనం సైతం గగ్గోలు పెడుతున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ నిధులు వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించకపోవడం, పోలవరం, అమరావతిల నిర్మాణాలకు నిధులు వడ్డనలో మొండిచేయి చూపడం, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్న విధంగా మోది సర్కారు వ్యవహించిందని సర్వత్రా నిరసనలు మెన్నంటుతున్నాయి. రాష్ట్ర ప్రజలు మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ వామపక్షాలు, వైసీపీ తదితర ప్రజాసంఘాలు గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర బంద్‌లో ఎటువంటి శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుచూపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసి కాంప్లెక్స్, ప్రధాన కూడళ్లలో బ్యాంకింగ్ వ్యవస్థ వద్ద గట్టి బందోబస్తును జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ అధికారులు కూడా బస్సు నిలుపుదల చేసేలా మందుస్తు చర్యలు చేపట్టారు. హోటల్, వ్యాపార వాణిజ్య సదుపాయాలు బంద్‌కు సంఘీభావం తెలియజేయాలని వామపక్ష, వైకాపా నేతలు నగరంలో హల్‌చల్ చేయడం కనిపించింది. ప్రైవేటు పాఠశాలలు, కార్పోరేట్ కళాశాలలు, పలు విద్యా సంస్థలు రాష్ట్ర బంద్ నేపధ్యంలో ముందుగానే సెలవు ప్రకటించారు.

ఇచ్ఛాపురం, పాతపట్నంపై...
హీరోగారి గురి!
ఆంధ్రభూమి బ్యూరో -
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నుంచి బరిలోకి దిగుతానంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అంతకుముందే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాలపై గురిపెట్టారు. ఈ రెండు అసెంబ్లీ సిగ్మెంట్లు నుంచి జనసేనా అభ్యర్థులు బరిలోకి దిగేందుకు రంగం సంసిద్ధమయ్యేలా గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్దానం కిడ్నీరోగులకు అండగా నిలిచిన సామాజిక సేవకుడిగా అక్కడ ప్రజలను మనసుదోచుకున్న పవన్ ఇచ్ఛాపురం నియోజకవర్గం ముందుగా ఆయన మదిలో నిర్మించుకోగా, తాజాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల జాబితాల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని మరొకటిగా జనసేనాపార్టీ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లది భిన్నమైన శైలి. వలసనేతలను ఆదరించి చట్టసభలకు పంపించడంలో వీరికి వీరేసాటి. ఇచ్ఛాపురం నుంచి ఎం.వి.కృష్ణారావు, పాతపట్నం నుంచి లక్ష్మీపార్వతి, శత్రుచర్ల విజయరామరాజు ఇక్కడ ఓటర్ల దీవెనలు పొంది రాజకీయ జీవితంలో రాణించారు. ఇటువంటి నియోజకవర్గాలను జనసేనా అధినేత ఎన్నుకోవడంలో ప్రధాన అజెండాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్‌కళ్యాణ్ ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన జనసేనా ప్రాంతీయ రాజకీయ పార్టీ సిక్కోల్ నుంచే ఆయన వౌలిక లక్ష్యాలను అధిగమించేందుకు వేదికగా ఎంచుకున్నారు. విద్య, వైద్యం మెరుగుపరచాలన్న రెండో లక్ష్యాన్ని ఇక్కడ ఉద్దానం నుంచి రాజకీయ అస్త్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంధించి - 24 గంటల్లో పరిష్కారం కావాలంటూ పవన్‌కళ్యాణ్ సామాజిక సేవకుడిగా అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే! అంతే - అప్పటి నుంచే శ్రీకాకుళం జిల్లా అందులో ఈశాన్యం దిక్కులో గల ఇచ్ఛాపురం నుంచి ఆయన రాజకీయ అంకుశం పనిచేయడం మొదలుపెట్టారు.
ఉద్దానం కిడ్నీరోగులను కలిసి వారికి అండదండగా నిలుస్తానని, కిడ్నీరోగులకు సకాలంలో వైద్యం, ఉచితంగా మందులు ఇవ్వాలని, ముఖ్యంగా వారిపై ఆధారపడిన కుటుంబాల పోషణకు పింఛన్లు ప్రకటించాలని పవన్‌కళ్యాణ్ ఇచ్చిన అల్టిమేటంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాయి. కేవలం మిత్రధర్మంగా పవన్ కోరికను తీర్చినప్పటికీ, ఆ క్రెడిట్ జనసేనానేతకే దక్కింది. ఉద్దానం కిడ్నీరోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పేందుకు నేరుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉద్దానం పర్యటన, అక్కడికి మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజాం పర్యటన, అందులో కిడ్నీరోగులకు పింఛన్లు ప్రకటించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
అంతే, అప్పటి నుంచే ఇచ్ఛాపురం నియోజకవర్గం ప్రజలంతా పవన్‌కళ్యాణ్ ప్రాంతీయ పార్టీ జనసేనాపార్టీకే మొగ్గు చూపేలా మారిపోయారు. తాజాగా, మత్స్యకారుల సమస్యలపై పోరాడతానంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండురోజుల కిందట ఆదివాసీలు మత్స్యకారులపై శ్రీకాకుళంలో దాడిచేసిన సంఘటనకు స్పందిస్తూ 198 కిలోమీటర్లు సముద్రతీరంలో గల మత్స్యకారుల జీవనవిధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ నెల 21న జిల్లా పర్యటన చేస్తానంటూ ప్రకటించడంతో జిల్లాలో మత్స్యకారులంతా జనసేనా నాయకుడుతోనే తమకు న్యాయం జరుగుతుందన్న దృఢ నిర్ణయానికి వచ్చినట్టు ఉంది.
టీడీపీ మేనిఫేస్టోలో మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ ఇచ్చే ఎన్నికల వాగ్దానం నెరవేర్చేందుకు తాను నడుంబిగిస్తానంటూ ఎ.పి. మత్స్యకారులకు పవన్‌కళ్యాణ్ భరోసా ఇవ్వడంతో సిక్కోల్‌లో సింహభాగం మత్స్యకారు ఓటర్లు జనసేనాపార్టీ వైపే మొగ్గు చూపేలా, పవన్ చెప్పిన మాటతోనే ఓటు వేసే విధంగా రాజకీయ పరిస్థితులు మారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రధానంగా రెండు అంశాలతో సిక్కోల్‌లో జనసేనా ప్రాంతీయపార్టీ టీడీపీ, వైసీపీ కొంపముంచేందుకు ‘ముందస్తు’ సేవలతో ప్రజలకు దగ్గరయ్యేలా సామాజిక పరిస్థితులు మారుస్తున్నట్టు ఉందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.
సిక్కోల్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఒక్కోక్క పార్టీ ఒక్కోక్క వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ 2019 ఎన్నికలే లక్ష్యంగా అధికారం కోసం అహర్నిశలు తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రోజుల కిందట ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని సాధించిన జగన్ యాత్ర దిగ్విజయంగా ముందుకి సాగుతుండగా, జిల్లాలో సీనియర్ నేత ధర్మానతోపాటు, అన్నీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, జనసేనా అధినేత పవన్‌కళ్యాణ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు పర్యటించి ప్రధాన ప్రజాసమస్యలపై పోరాటానికి గళం విప్పిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా కిందిస్థాయి నేతలతో సమావేశాలు జరుపుతూ వ్యూహాలను ఆచరణలోకి తెచ్చి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యూహాలను పదునుపెట్టే నేపథ్యంలో టీడీపీ, వైసీపీలతోపాటు జనసేనా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాల్లో జనసేనా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు కల్పించిన పవన్ ఈ సారికూడా మద్దతు కల్పించే అవకాశాలు దాదాపు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. మద్దతు విషయంమై పవన్ చాలా సార్లు చాలా సభల్లో సంకేతాలు ఇచ్చారు కూడా. ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచే జనసేన తరుఫున నాయకులు బరిలోకి దిగుతున్నారని, ఇక వారికి టీడీపీ మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ అదే జరిగితే వారికి బి.్ఫరాలు రాదు సరికదా జనాల్లో ఉన్న పేరు, పలుకుబడి పోయి ఎటూకాకుండా పోతాం అని హాడలెత్తిపోతున్నారు. మళ్ళీ సొంతగూడు వైసీపీ చేరుకోవాలని కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ చాలా సందర్భాల్లో ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు పార్టీలోకి తమ తప్పులు తెలుసుకుని మళ్ళీ పార్టీలోకి వస్తే చేర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే, వారిపై పూర్తి నమ్మకం కుదిరాలి అని చెప్పుకురావడం వెనుక చిదంబర రహస్యం పవన్ భయమేనంటూ రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.

...........
వైసీపీ సంపూర్ణ మద్దతు: తమ్మినేని
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 7: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈ నెల 8న వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు వైసీపీ పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం తెలిపారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన పై విధంగా మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, వైసీపీ ఆందోళన నిర్వహిస్తే ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రత్యేక ప్రతిపత్తి సరిపోతుందని చంద్రబాబునాయుడు ఊరూర డప్పులు వేశారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాతోపాటు రైల్వేజోన్, ఆర్థికలోటు తదితర సౌకర్యాలు అన్నింటినీ తన కమీషన్ల కోసం కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన నిర్వహణ బాధ్యతలను తాను తీసుకున్నందునే కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రం లోకువైందని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు కమీషన్ల కక్కుర్తే రాష్ట్రాన్ని అవస్థలపాలు చేశారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు నిజాయితీ లేదని నిజాయితీ ఉంటే మంత్రివర్గం నుంచి తమమంత్రులను ఉపసంహరించాలని సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు లాంటి అవినీతిపరుడు ఈ రాష్ట్రాన్ని ఎన్నడూ పరిపాలించలేదని ఆ ప్రభావం ఐదుకోట్ల మంది ఆంధ్రులపై చూపుతుందన్నారు. గురువారం బంద్‌లో ప్రజలందరూ పాల్గొలన్నారు.

ఇంత నిర్లక్ష్యమా...?
సీతంపేట, ఫిబ్రవరి 7: ఉద్యోగమంటే ఇంత నిర్లక్ష్యమా? పనిచేయాలనే చిత్తశుద్ధి, ప్రయత్నం లేకపోవడం ఏంటని కలెక్టర్ కె ధనుంజయరెడ్డి అధికారుల పై మండిపడ్డారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో బుధవారం మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి పై ఎంపిడిఓ,తహశీల్దార్,ఐకెపి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఐఎస్‌ఎల్ నిర్మాణాలను సకాలంలో పూర్తిచేసి ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వం లక్ష్యాలను విధిస్తే మండలస్థాయిలో అధికారులు ఏమిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి ఎంపిడిఒ, తహశీల్దార్‌పై అసహనం వ్యక్తంచేశారు. గ్రామాల్లో గడపగడపకు వెళ్లి మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా అని సమాచారం సేకరించాలని 2017 జులై నెల నుండి చెబితే ఇప్పటికీ పూర్తిసమాచారం మీ దగ్గర లేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేసారు. మీరు ఇచ్చే సమాచారం అంతా తప్పులతడకగా ఉందని అన్నారు. మండలంలో 3,996 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 1800 మాత్రమే కట్టాలని మీరు ఇచ్చే రిపోర్టులో ఉందని అన్నారు. ఇంత అధ్వాన్నమైన పనితీరు నేను ఎక్కడ చూడలేదని, పనిచేస్తే ఉండండి లేకుంటే వెళ్లి
పోండని మండిపడ్డారు. జిల్లాలో 38 మండలాల్లో సీతంపేట మండలం 36వ స్థానంలో ఉందన్నారు. ఎవరికి చిత్తశుద్ది లేదని మీరు ఇలా పనిచేస్తున్నారు కనుకే జిల్లా వెనుకబడి ఉందన్నారు. వెలుగు సిబ్బంది కూడ కథలు చెబుతున్నారే తప్పా ప్రగతి చూపించలేకపోతున్నారన్నారు. ఎంపిడి ఓలకు అన్ని అధికారాలు ఇచ్చామని, ఐఎస్‌ఎల్ నిర్మాణాల్లో ఎవరు చిత్తశుద్ధితో పనిచేయకపోయిన వారి పై చర్యలు తీసుకోమని ఆదేశించినప్పటికి స్వచ్ఛగ్రహీలను ఎందుకు ఇంతవరకు నియమించుకోలేదని ఎంపిడిఓ రాధాక్రిష్ణను కలెక్టర్ ప్రశ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఐటిడిఎ పిఒ ఎల్ శివశంకర్‌ను కలెక్టర్ ఆదేశించారు.సరిగా పనిచేయని అధికారులను ఉపేక్షించకండని,అవసరమైతే వారి జీతాలను కూడ నిలుపుదల చేయండని పిఒకు సూచించారు.
మార్చి 31కి పూర్తికావాలి
సీతంపేట మండలంలో ఐఎస్‌ఎల్ నిర్మాణాలు మార్చి 31వతేది నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ కె ధనుంజయరెడ్డి ఆదేశించారు.ఇప్పటికి నిర్మాణ దశలో ఉన్న మరుగుదొడ్లకు మొదటివిడత బిల్లు చెల్లించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రస్ ఆన్‌లైన్‌లో తమకు తెలుస్తోందన్నారు.కుసిమి,కుడ్డపల్లి, దారపాడు, గొయిది పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి పై పంచాయతీల వారిగా సమీక్షించారు. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఈ జిల్లా బాగా వెనుకబడి ఉందని అన్నారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాల్లో రాష్ట్ర ఎవరేజ్ 2017 అక్టోబర్ నాటికి 42నుండి 84శాతంకి చేరిందన్నారు. అలాగే జిల్లా విషయానికి వస్తే 27శాతం నుండి నేటికి 42శాతానికి మాత్రమే చేరుకున్నామన్నారు.శతశాతం పూర్తిచేసి ఓడిఎఫ్ జిల్లాగా పేరు తెచ్చుకోవాలంటే క్షేత్రస్థాయిలో అధికారులందరూ సామాజిక బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం ఐటిడి ఎ ఆవరణలో ఏర్పాటుచేసిన మరుగుదొడ్ల శాంపిల్స్ నిర్మాణాలను పరిశీలించారు.ఈ సమీక్షలో జెడ్‌పి సిఒఓ నగేష్,ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ టి శ్రీనివాస్,సర్పంచ్‌లు,అధికారులు పాల్గొన్నారు.

ఓడీఎఫ్‌తోనే ఆరోగ్యవంతమైన సమాజం
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 7: ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరం కృషి చేస్తే జిల్లాను ఓడిఎఫ్‌గా తీర్చిదిద్దగలమని జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి స్పష్టంచేశారు. ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయని వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో ఎన్ ఎస్ ఎస్ విభాగం నేతృత్వంలో బుధవారం ఓడిఎఫ్‌పై సర్పంచ్‌లు, ఎంపిటీసీలు పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చైర్‌పర్సన్ పాల్గొని మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో బాగస్వామ్యులై మార్చి మాసాంతానికి లక్ష్యాలను అధిగమించాలన్నారు. జిల్లా యంత్రాంగం ఎంతో ప్రణాళికాబద్ధంగా ఓడిఎఫ్‌గా జిల్లాను మార్చేందుకు కృషి చేస్తుందని అందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఇటీవలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓడిఎఫ్ లక్ష్యాలను అధిగమించకుంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తానని అల్టీమేటం ఇచ్చారని వీటిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులకు అండగాల నిలవాలన్నారు. వీసీ రామ్‌జీ మాట్లాడుతూ శతశాతం లక్ష్యాలు అధిగమించేందుకు వర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమష్టికృషితోనే సత్ఫలితాలు ఇస్తాయన్నారు. రిజిస్ట్రార్ జి.తులసీరావు, తహశీల్దార్ కె.రామ్మోహనరావు, ఎంపిడివో మోహన్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ అనూరాధ, ఏవో బి. ఉషారాణి, వెలుగు ఏపిఎం వెంకటరత్నం, ఏపిడి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మండలంలోని 6,700 మరుగుదొడ్లు మార్చి మాసాంతానికి పూర్తి చేయాల్సి ఉందని అధికారాలు గణాంకాలు వివరించారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వెలుగు ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.

కొవ్వాడ కంపెనీ వద్దంటూ సంతకాలతో నిరసన
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 7: వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ కొవ్వాడ రావద్దని సంతకాలతో సి పి ఎం బుధవారం స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద నిరసన తెలిపారు. వెస్టింగ్ ఎలక్ట్రిక్ కంపెనీ అణువిద్యుత్ కర్మాగారం నిర్మించాలని భారత ప్రభుత్వం 2015 నుండి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని నితివిద్దిలో నిర్మించాల్సిన అణుకర్మాగారాన్ని అక్కడ ప్రజల పోరాటం వలన కొవ్వాడకు మార్చుతున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. 2017లో వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆర్థిక ఇబ్బందులతో దివాళా తీసినట్లు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందన్నారు. అందువల్ల 2017 జూలై నాటికి భారత్ అమెరికాల మధ్య కొవ్వాడ అణుకర్మాగారంపై మొత్తం ఒప్పందం జరగవలసినా నేటికీ జరగలేదని పేర్కొన్నారు.
దివాళా తీసిన వెస్టింగ్‌హౌస్ కంపెనీ యాజమాన్యం భారతదేశంలో కొవ్వాడను సందర్శించాలని ఇటీవల ప్రతిపాధిస్తున్నట్లుగా 2018 జనవరి 31న ఓ పత్రికలో వార్తలు వచ్చాయని తెలియజేశారు. వెస్టింగ్ హౌస్ కంపెనీ యాజమాన్యం కొవ్వాడను సందర్శించాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణువిద్యుత్ కర్మాగార ప్రతిపాధనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిటు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్శింగరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరనరావు,జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కె.శ్రీనివాస్, డి.గోవిందరావు, సిహెచ్ అమ్మన్నాయుడు, ఎన్.రమణ, తేజేశ్వరరావు, కూన రామం, కె.వి జగన్నాధం, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాల ఆందోళనకు వైసీపీ మద్దతు
జలుమూరు, ఫిబ్రవరి 7: నేడు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి వామపక్షాలు చేపడుతున్న బంద్‌కు వైసీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ , మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం ఊడికలపాడు గ్రామంలో సర్పంచ్ విఠల్‌రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ వైఖరిపై ఆయన విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై రాష్ట్రానికి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు గంటకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్,పోలవరం ప్రాజెక్టు పలు అంశాలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దీనిని ప్రజలందరూ గుర్తిస్తున్నారన్నారు. మనకు రావాల్సిన హక్కుల కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేయడమే తప్ప వేరే పనిలేదని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ సర్కారులో ప్రజలు అనేక అన్యాయాలకు గురౌతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు మొజ్జాడ శ్యామలరావు, జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, వైసీపీ నేతలు ధర్మాన జగన్, కనుసు సీతారాం, గోపి, పాగోటి రాజప్పలనాయుడు, బగ్గు లక్ష్మణరావు, పైడి విఠల్‌రావు, పంచిరెడ్డి రాజారావు, మూకళ్ల సత్యం, బస్వ యోగేశ్వరరావు, పొన్నాడ విజయకుమార్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యతగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
* డీపీవో కోటేశ్వరరావు
సారవకోట, ఫిబ్రవరి 7: వ్యక్తిగత పారిశుద్ధ్యంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం సామాజిక బాధ్యతగా ప్రజలు స్వీకరించాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు హితవుపలికారు. పెద్దలంబ పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకగా సాగుతున్న నేపధ్యంలో బుధవారం స్థానిక పంచాయతీలో విస్తృతంగా పర్యటించి ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని మరుగుదొడ్ల నిర్మాణం ఆవశ్యకతను సోదాహరణంగా వివరించారు. పంచాయతీకేంద్రమైన పెద్దలంబలో 50 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఎంపిడివో జగదీశ్వరరావు, పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు, సంధ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలుగా
మోడల్ పాఠశాలలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 7: కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలను, కళాశాలలను ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో విద్యాశాఖ నిర్వహించే పాఠశాలలుగా మారుతున్నట్టు ఏపీ ఎంఎస్‌టిఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి.లక్ష్మీనారాయణ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసుదేవరావు, సురేష్‌లు హర్షం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యుల కమిటీ నిర్ణయం ప్రకారం మోడల్ పాఠశాలల ప్రత్యేకతను, స్వయం ప్రతిపత్తిని కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిర్వహించి రెగ్యులర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ సిబ్బందికి ట్రెజరీ పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా జీవో విడుదల చేయాలని సభ్యులు కోరారు.

మూడు రోజులపాటు
గరికపాటి ప్రవచనాలు
నరసన్నపేట, ఫిబ్రవరి 7: మండలంలోని గుండువిల్లిపేట గ్రామం వద్ద నిర్వహిస్తున్న ఉమాసహిత స్వయంభూయేశ్వర ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచవనాల్లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచన కారులు గరికపాటి నర్శింహారావు మూడు రోజులు పాటు ప్రవచనాలను నిర్వహించేందుకు వచ్చేయనున్నారు. బుధవారం ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో బ్రోచర్‌లను ఆలయ ధర్మకర్త విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండువిల్లిపేట గ్రామంలో స్వయంభూయేశ్వర ఆలయాన్ని నిర్మించి 5 సంవత్సరాలు పూర్తవుతుందని దీనికి సంబంధించి గరికపాటివారితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు.
అంతేకాకుండా దూలిపాలమహాదేవమణి వారిచే ప్రవనచ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని దీనిని భక్తులు అందరూ సద్వినియోగం చేయాలని కోరారు. టిటిడి జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ గాలి మృతికి
టీడీపీ సంతాపం
బలగ, ఫిబ్రవరి 7: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు అకాల మరణానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందిన గాలి ముద్దు కృష్ణంనాయుడు పార్టీకి ఎంతగానో సేవలందించారన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. గాలి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
‘మురుగు’న పేట!
లక్ష్యంపై నిర్లక్ష్యం * పీడీ ఆగ్రహం
నరసన్నపేట, ఫిబ్రవరి 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛ భారత్‌పేరిట ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని సంకల్పం చేసుకున్నప్పటికీ నిధులు ప్రభుత్వం వెచ్చిస్తున్నా మండలంలో వీటి నిర్మాణాలు మురుగున పడిపోయాయని డీఆర్‌డీ ఏపిడి జి.కిశోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ నుండి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ కనీసం 50 శాతం నిర్మాణాలు కూడా చేపట్టకపోవడం దురదృష్టకరమని తెలిపారు. అధికారుల్లో చైతన్యం తీసుకునిరావాలని ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా వారికి తోడుగా నిలిచి శతశాతం మరుగుదొడ్డి నిర్మించేటట్లుగా చూడాలని సమావేశంలో తెలిపారు. అనంతరం మండలంలోని యారబాడు, ఉర్లాం పంచాయతీలలో ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్లపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మరుగుదొడ్డి లేకుంటే ఇప్పటికే రేషన్, పించన్ నిలుపుదల చేస్తున్నామని ఇకపై విద్యుత్ కనెక్షన్లు తొలగించడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని ఛేదించాలని ఆయన ఆదేశించారు. ఎంపిడివో విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు.