Others
సాయంకాలాన్నీదుకుంటూ...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 February 2018
- సాంధ్యశ్రీ, 8106897404

చరమ మోహనమగు దివాచ్ఛాయలందు
సంజ కెంజాయ దానిమ్మ సగము విచ్చె
ప్రణయ సుకుమార గీతముల్ పాడుకొంచు
ముగ్ధ హృదయాలు క్రొంగొత్త మోసులెత్తె...
గోధూళి నీరెండ గొనబు
ఆకురాలు క్షణాన్ననుభవిస్తూ
నక్షత్ర గుచ్ఛం నూలుకొలిపె ముహూర్తాన్ని
ఆకాశానికందిస్తాయ...
పక్షులు స్నానం చేసే
పొలాల మీది స్వేచ్ఛావాయువులు
మానవ స్పృహా మార్మిక జన్మబీజానికి
ఊపిరి దోసిళ్ళెత్తుతాయ...
కలల శిల్పాలు చెక్కే నిద్రను మోస్తున్న
రాత్రి కనుపాపలు
సుప్రభాత సౌందర్యాన్ని మేల్కొలిపే
సూర్యకిరణాన్ని మీటుతాయ...
ప్రభాత పరిమళాలు
పూలరేకుల మీంచి
హరివిల్లును మోసే మంచుబిందువుగా
తెరల బాఱు తుంచే...
కడు విలాసమీ వెనె్నల కాల్వదాటి
సర్వమొక భావనా చిత్తశాలయగును
తెల్లవారుచునుండ విదీర్ణతటిని
స్వప్నమొక్కటి చుక్కయై జారిపడును...