విశాఖ

ఈనెల 25 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, ఫిబ్రవరి 15: స్వచ్చ్భారత్ మెషిన్ పథకం కార్యక్రమంలో భాగంగా ఇంటింటా నిర్మించతలపెట్టిన మరుగుదొడ్లు నిర్మాణం ఈనెల 25నాటికల్లా పూర్తిచేయాల్సిందేనని, అలా కాని యెడల చెల్లింపులు నిలుపుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేసారు. గురువారం మండలంలోని చినతీనార్ల గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఆ తరువాత ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి అధికారులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. అంతకుముందు ఆయన మత్స్యకార గ్రామం చినతీనార్లలో అధికభాగం ఇంటింటికీ తిరిగి అక్కడ నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల తీరుతెన్నులను పరిశీలించారు. చాలావరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావడంతో పూర్తయిన మరుగుదొడ్లకు సకాలంలో జియోట్యాగింగ్ పనులు చేపట్టి చెక్‌మెదర్‌మెంట్ పూర్తిచేసిన తరువాత పేమెంట్‌లు చెల్లించాలని ఆర్‌డబ్ల్యుఎస్ సహా గృహనిర్మాణం, మండల ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. ఏదిఏమైనా ఈనెలాఖరునాటికి మండలంలోని అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్)గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఓడిఎఫ్ ఉద్యమంలో అన్ని శాఖల అధికారులు, దిగువ స్థాయి సమిష్టిగా కృషిచేసి ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని గ్రామాల్లో మండల స్థాయి అధికారులు నిర్ధేశించిన అధికారులు గ్రామాల్లో తిష్టవేసి శతశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషిచేయాలని, ఈ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలని కలెక్టర్ మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, మండల ప్రత్యేకాధికారులు నాగపద్మారావు, కాళేశ్వరరావు, నర్సీపట్నం ఆర్డీవో కె. సూర్యారావు, ఎంపీడివో ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ రాణీ అమ్మాజీ, ఇవోఆర్‌డి పిఎస్‌కుమార్, రాయవరం ఎంపీడివో స్వరూపారాణి, శిరీషామానస, గ్రామసర్పంచ్ సరిపల్లి శ్రీను, జెడ్పీటీసి కొప్పిశెట్టి కొండబాబు సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.