హైదరాబాద్

అన్ని స్కూళ్లలో స్వచ్ఛ కమిటీలు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: మహానగరంలోని అన్ని స్కూళ్లలోని విద్యార్థులకు స్వచ్ఛత పై అవగాహన పెంపొందించేందుకు వెంటనే అన్ని స్కూళ్లలో స్వచ్ఛ కమిటీలను వేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డ ఆదేశించారు. ఈ దిశగా సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలతో ఒప్పించేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిళ్లవారీగా ఉన్న అధికారులు కృషి చేయాలని కూడా ఆయన సూచించారు. విద్యార్థినీ విద్యార్థులచే ప్రతి తరగతిలోనూ, స్కూల్‌లోనూ స్వచ్ఛ కమిటీలను ఏర్పాటు చేయటంతో పాటు కమిటీ సభ్యుల పేర్లను ఆయా పాఠశాలల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించేందుకు వీలుగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి స్కూల్‌లో స్వచ్ఛ కమిటీల ఏర్పాటుపై చేపట్టాల్సిన చర్యలపై కమిషనర్ ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను వంద శాతం సందర్శించి స్వచ్ఛ కమిటీలను ఏర్పాటు చేయటంల తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు స్కూళ్ల ప్రార్థన సమయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్య తనకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ కమిటీ సభ్యులకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటంతో పాటు సర్వే సందర్భంగా అడిగే ఆరు ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చేప్పేలా వారిని చైతన్యవంతులను చేయాలని కమిషనర్ సూచించారు. స్వచ్ఛ కమిటీలో నియమితులయ్యే ప్రతి సభ్యుడికి ఓడీఎఫ్ నగరంపై హామీ పత్రం సంతకం చేయటంతో పాటు తమ పాఠశాల టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండే విధంగా పరిశీలించాలని వారికి తెలియజేయాలని సూచించారు.

కవితా పురస్కారాల ప్రదానం

కాచిగూడ, ఫిబ్రవరి 17: కిరణ్ సాంస్కృతిక సమాఖ్య జాతీయ స్థాయిలో నిర్వహించిన కవిత పోటీలలోని విజేతలకు ఉత్తమ కవిత పురస్కారాల ప్రదానోత్సవం కిరణ్ సాంస్కృతిక సమాఖ్య, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత ఆచార్య ఎన్.గోపి పాల్గొని విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో కవిత పోటీలను నిర్వహించి వారిని ప్రొత్సహించేందుకు పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, సాహితీ కిరణం మేనేజర్ పొత్తూరి జయలక్ష్మీ, సంస్థ అధ్యక్షుడు లంకా వేంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

వచన కవితా పితామహుడు సినారె

కాచిగూడ,్ఫబ్రవరి 17: వచన కవితా పితామహుడు డాక్టర్ సీ. నారాయణ రెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అన్నారు. సాధన సాహితీ స్రవంతి, శ్రీత్యాగరాయ గానసభ, భావ సారూప్య సాహిత్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘సినారె సాహితీ వైజయంతి’ శనివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిధారెడ్డి మాట్లాడుతూ..సాహిత్యంలో విభిన్న ప్రక్రియాల్లో రచనలు చేసిన వ్యక్తి సినారె అని కీర్తించారు. వచన కవితకు వనె్న తెచ్చిన ఘనత సినారెకు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రముఖ కవి డా.తిరునగరిచే ‘సినారె ప్రపంచ పదుల విశిష్టత’ అనే అంశంపై ప్రసంగించారు. ఆచార్య టీ.గౌరి శంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానా శాస్ర్తీ, సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహాచార్య పాల్గొన్నారు.

సమాజంలో స్ర్తి పాత్ర ఎనలేనిది

కాచిగూడ, ఫిబ్రవరి 17: సమాజంలో స్ర్తి పాత్ర ఎనలేనిదని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎన్.రామచంద్రం అన్నారు. ప్రముఖ రచయిత్రి డా.మృణాళినీ రాజ్ రచించిన ‘పంచ మహాకావ్యాలలో స్ర్తి పాత్ర చిత్రణ, అక్షర దీప్తి’ పుస్తకాల ఆవిష్కరణ సభ ఉజ్జ్వల్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రం పుస్తకాలను ఆవిష్కరించారు. మృణాళిని పంచ మహాకావ్యాలలో స్ర్తిపాత్రపై ఎంతో పరిశోధన చేసి పుస్తక రూపంలో తీసుకురావాడం ఎంతో అభినందనీయమని అన్నారు.