ఆంధ్రప్రదేశ్‌

సిబ్బందికి శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2017 జనవరి నుంచి వర్తింపు నవయుగకు రూ.1244 కోట్ల కాంక్రీట్ పనుల అప్పగింత
ఏపీఈడీబీ, ఎస్‌ఐపీబీలకు స్వయం ప్రతిపత్తి విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు
రూ.4188 కోట్ల ఈఏపీలకు పాలనా ఆమోదం ఏసీబీలో 350 ఖాళీల భర్తీకి ఓకే
కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కాలువ

విజయవాడ, ఫిబ్రవరి 21: ఉగాదికి ముందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురందించింది. 2.09 శాతంమేర డీఏను పెంచేందుకు నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.1244 కోట్ల రూపాయల కాంక్రీ ట్ పనులను నవయుగ సంస్థకు అప్పగించేందుకు నిర్ణయించింది. విశాఖ, తిరుపతిలలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.
2015 వేతన సవరణ మేరకు డీఏను 22.008 నుంచి 24.104 శాతం మేరకు పెంపు. పెంచిన కరవుభత్యం 2017 జనవరి 1నుంచి చెల్లిస్తారు. నగదు రూపంలో మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1న తీసుకునే మార్చి నెల జీతంతో చెల్లిస్తారు. పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, సీపీఎస్ ఉద్యోగులకు మార్చి నెల నుండి పెంపు వర్తిస్తుంది. గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇస్తున్న మొత్తానికి అదనంగా రూ.300 చొప్పున తాత్కాలికంగా పెంచనున్నారు. కరవుభత్యం పెంపు వల్ల ప్రతి నెల రూ.69.91 కోట్లు, గ్రామ సేవకులకు పెంపు వల్ల రూ.6.57 కోట్లు పడనుంది. ఈ రెండింటివలన సంవత్సరానికి రూ.800 కోట్ల మేర భారం పడుతుంది.
* పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్ పనులను రూ.1244 కోట్ల మేర పన్నులను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించేందుకు అనుమతులు మంజూరు.
* ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్, స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ కమిటీలకు స్వయంప్రతిపత్తి కల్పించేలా బిల్లు రూపకల్పన.
* విశాఖ, తిరుపతిలలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం. విశాఖలో 2.7 ఎకరాలను ఎస్‌పీఏ సినిమాస్‌కు కేటాయించేందుకు జీవీఎంసీ కమిషనర్‌కు అధికారమిస్తూ నిర్ణయం. తిరుపతిలో 3.72 ఎకరాలలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.25 కోట్లు వ్యయం కానుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రాథమికంగా ఇందుకయ్యే ఖర్చులను ఏపీటీడీసీ భరిస్తుంది. పీపీపీ పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో కనె్వన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, ఆరు మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు, త్రీస్టార్ హోటల్ నిర్మిస్తారు.
* ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద ఏఐఐబీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పరిపాలనా ఆమోదం ఇచ్చారు. రూ.4,188 కోట్ల రూపాయలతో 42 నాన్ అమృత్ పట్టణాల్లో వౌలిక సదుపాయాలను కల్పిస్తారు.
* అవినీతి నిరోధక శాఖలో 300 ఖాళీలను నేరుగా, 50 ఖాళీలను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ. రాజధాని నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతికి తావులేకుండా చూసేందుకు ఏసీబీని బలోపేతం చేయాలని నిర్ణయం.
* కృష్ణా జిల్లా గన్నవరంలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సీనియర్ సివిల్ జడ్జిల పోస్టుల మంజూరుకు నిర్ణయం.
* అసెంబ్లీ స్పీకర్‌కు పీఆర్వోను నియమించేందుకు వీలుగా ఒక పోస్టును సృష్టించేందుకు అనుమతి.
* విజయవాడ విద్యాధరపురం 13వ వార్డులో ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు 92 సెంట్ల భూమి కేటాయింపు.
* శ్రీకాకుళం జిల్లా రణస్థలం సంచాంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 44 ఎకరాల కేటాయింపు.

chitram...
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు