జాతీయ వార్తలు

కాల్వలోకి పల్టీకొట్టిన ట్రక్ 32మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావ్‌నగర్, మార్చి 6: గుజరాత్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి ఓ వంతెన పైనుంచి కాల్వలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 32 మంది పెళ్లివారు మృతిచెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించగా ఈ దారుణం చోటుచేసుకుంది. భావ్‌నగర్‌లోని రంగేలా వంతెన పైనుంచి కాల్వలోకి ఎనిమిది అడుగుల లోతులో ట్రక్ పడిపోయింది. ట్రక్‌లో మొత్తం 60 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర హోమ్‌మంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియను సీఎం ప్రకటించారు. 60 మంది పెళ్లివారిని తీసుకున్న ట్రక్ అనిడా గ్రామం నుంచి వస్తోందని ఎస్పీ ఐఎం సరుూద్ తెలిపారు. బొటాడ్ జిల్లా తోటం గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. ప్రమాదంలో మొత్తం 32 మంది చనిపోయారని హోమ్‌మంత్రి జడేజా రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. 26 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారని అన్నారు. ఉదయం సరిగ్గా 7.30-7.45 గంటల సమయంలో భావ్‌నగర్-రాజ్‌కోట్ హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
chitram...
ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుమికూడిన జనం, పోలీసులు