జాతీయ వార్తలు

హఫీజ్ సరుూద్ పార్టీకి గుర్తింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 9: ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సరుూద్ ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ మిల్లీ ముస్లిం లీగ్‌కు (ఎంఎంఎల్) గుర్తింపు లభించే అవకాశాలు మెరుగైనట్టు పాక్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హఫీజ్ సరుూద్ నేతృత్వంలోని మిల్లీ ముస్లింలీగ్ పార్టీ దరఖాస్తును తిరస్కరిస్తూ గతంలో పాక్ ఎన్నికల సంఘం (ఈసీపీ) తీసుకున్న నిర్ణయాన్ని, ఇస్లామాబాద్ హైకోర్టు గురువారం పక్కన పెట్టి, రిజిస్ట్రేషన్ కోసం పార్టీ వాదనలను వినాలని ఈసీపీని ఆదేశించడంతో హఫీజ్ సరుూద్ పార్టీకి గుర్తింపు లభించే అవకాశాలు మెరుగయ్యాయి. హఫీజ్ సరుూద్‌ను అరెస్ట్ చేయకుండా విధించిన స్టేను పాక్ కోర్టు ఏప్రిల్ 4 వరకు పొడిగించిన తర్వాత ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హమని డాన్ దినపత్రిక పేర్కొంది. గతంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎంఎంఎల్ పార్టీ అధ్యక్షుడు సైఫుల్లా ఖలీద్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం, వాటిల్లో సభ్యులు కావడం పాక్ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పిస్తున్న ప్రాథమిక హక్కు అంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే పాక్ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందని భావిస్తే పరిమిత ఆంక్షలు విధించవచ్చునని పిటిషనర్ పేర్కొన్నారు. అందువల్ల తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ఈసీపీని ఆదేశించాలని, పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను పునః పరిశీలించేలా ఎన్నికల సంఘాన్ని నిర్దేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. నిజానికి మిల్లీముస్లింలీగ్‌కు, నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌కు అనుమతించవద్దంటూ ఈసీపీకి, పాక్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు గతంలో జారీ చేసింది. జమాత్ ఉద్ దౌలా, దాని స్వచ్ఛంద సేవా సంస్థ ఫలాహ్-ఇ-ఇన్సానియత్, పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చట్టం-1948 కింద నిషేధిత సంస్థలంటూ మంత్రిత్వశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈసీపీ, పార్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతించలేదు.
కాగా పాకిస్తాన్‌లో ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. 2018 సాధారణ ఎన్నికల్లో జమాత్ ఉద్ దావా, ఎంఎంఎల్ పార్టీ బ్యానర్ కింద పోటీ చేస్తుందని హపీజ్ సరుూద్ గతంలో ప్రకటించాడు.
ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశం, పాకిస్తాన్‌ను గ్రే జాబితాలో ఉంచిన నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటిఎఫ్ కోరిన వాటిల్లో సరుూద్‌కు చెందిన ‘‘్ఛరిటీ’’ సంస్థలు అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.