జాతీయ వార్తలు

మోదీ పాలనలో తిరోగమన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: ఎన్‌డీఏ పాలనలో దేశం తిరోగమన దిశగా వెళ్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. కుమారుడు రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత మీడియాకు దూరంగా ఉంటున్న సోనియా ముంబయిలో శుక్రవారం ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్‌డీఏకు తామే ప్రత్యామ్నాయం అనీ, మోదీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ఆమె వెల్లడించారు. ‘మన దేశం, మన సమాజం, మన స్వేచ్ఛపై ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి’ అని ఆమె ఆరోపించారు. దేశంలో ఎవరూ స్వేచ్ఛగా లేరని కాంగ్రెస్ నాయకురాలు అన్నారు. బీజేపీ మంత్రులు చివరికి రాజ్యాంగానే్న తిరగరాయాలన్న వ్యాఖ్యలు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేవేనని ఆమె విమర్శించారు. ప్రజలతో మమేకం కావడానికి కొత్త పద్ధతులు ఎంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందని స్పష్టం చేశారు. 2014కు ముందు దేశంలో అభివృద్ధి జరగలేదని చెప్పడం ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్న మోదీ సర్కార్ ప్రచారం సత్యదూరమని ఆమె తెలిపారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సమాజంలో అశాంతిని రేపుతున్నాయని సోనియా తెలిపారు. పార్లమెంటులో ప్రతిపక్షాల నోరునొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంటును మూసేస్తే తాము ఇళ్లకు వెళ్లిపోతామని ఆమె విమర్శించారు. వాజపేయి హయాంలో పార్లమెంటు గౌరవప్రదంగా, హుందాగా నడిచేదని 71 ఏళ్ల సోనియా వ్యాఖ్యానించారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మతసామరస్యానికి విఘాతం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. భయం, బెదిరింపుల మధ్య జనం జీవిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు అన్నారు. మోదీ ప్రభుత్వంలో న్యాయవ్యవస్థ సంక్షోభంలో పడిపోయిందని ఆమె చెప్పారు. స్వేచ్ఛను హరించేస్తున్నారని, ఏది తినాలి, ఎలా ఉండాలన్నదానిపైనా ఆంక్షలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ నిజంగా ఆ హామీని అమలుచేసిందా? అని ఆమె నిలదీశారు.
2జీపై అసత్య ప్రచారం
టుజీ స్పెక్ట్రం కేటాయింపుల్లో కాగ్ కథనాలను ఆసరా చేసుకుని 2014 లోక్‌సభ ఎన్నికల్లో గోరంతను కొండంతలుగా చేసి ప్రచారం చేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు అలా జరిగి ఉంటే ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లి ఉండేది కాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చెప్పడం, తద్వారా భారీగా అవినీతి జరిగిపోయినట్టు ప్రచారం జరిగిందని శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి జరిగిపోయిందంటూ అతిశయోక్తితో కూడిన ఓ రకమైన ప్రచారం చోటుచేసుకుందని సోనియా పేర్కొన్నారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో అవినీతిపై జరిగిన ప్రచారం అంతా అలాంటిదే. 2జీ స్పెక్ట్రం సంఘటననే తీసుకుందాం.. వాస్తవానికి భిన్నంగా ప్రచారం జరిగింది. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిపోయిందని కాగ్ ఆనాడు ఆరోపించింది. ఆ వ్యాఖ్యలు చేసిన పర్సన్ ఇన్‌చార్జి ఇప్పుడు ఓ ఉన్నత పదవిని అనుభవిస్తున్నారు’ అని ఆమె వెల్లడించారు. కాగ్ మాజీ వినోద్‌రాయ్ ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలోని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) అధిపతిగా ఉన్నారు అని సోనియా తెలిపారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరీతో ప్రశ్న-జవాబు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి జరిగిపోయిందంటూ గగ్గోలుపెట్టిన వారు కోర్టుల్లో నిరూపించలేకపోయారని విమర్శించారు.