జాతీయ వార్తలు

ముషారఫ్‌ను అరెస్ట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 9: పాక్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌ను అరెస్ట్ చేసి, ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రత్యేక పాకిస్తాన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. 2007లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన అంశంపై, ఆయన రాజద్రోహం నేరం కింద కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. 2014, మార్చిలో ఆయనపై పెషావర్ హైకోర్టులో రాజద్రోహ నేరారోపణ చేస్తూ పాక్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎమర్జెన్సీ విధింపు వల్ల అనేక మంది సీనియర్
న్యాయమూర్తులు గృహాలకే పరిమితం కావాల్సి వచ్చింది. దాదాపు వంద మంది న్యాయమూర్తులను పదవులనుంచి బర్తరఫ్ చేశారు. ఫెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిది నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. విచారణ సందర్భంగా ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ముషారఫ్ ఆస్తుల వివరాలు కోర్టుకు అందించింది. ప్రాసిక్యూటర్ అక్రమ్ షేక్ వాదనలు వినిపిస్తూ, ముషారఫ్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 2016, మార్చిలో ముషారఫ్, దుబాయ్‌కి వెళ్లిపోయారు. అదే ఏడాది మే నెలలో, కోర్టు ఆయన్ను నేరస్థుడుగా ప్రకటించింది. ఆయనపై కొనసాగుతున్న రాజద్రోహం కేసు రుజువైతే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడుతుంది. విదేశాల్లో ఉన్న ఆయన్ను దేశానికి తిరిగి రప్పించేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ, కోర్టు, ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ అధికార్లను (ఎఫ్‌ఐఎ) ప్రశ్నించింది. ఆంతరంగిక మంత్రిత్వశాఖ నుంచి అభ్యర్థన వస్తే అప్పుడు స్పందిస్తామని ఎఫ్‌ఐఎ అధికార్లు కోర్టుకు తెలిపారు. వెంటనే అఫ్రిది స్పందిస్తూ ముషారఫ్‌ను అరెస్ట్ చేసి, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 21 వరకు ఆస్తుల స్వాధీనం చేసుకోవద్దంటూ, ముషారఫ్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
దుబాయ్‌లోఉన్న ముషారఫ్‌ను అరెస్ట్ చేసేందుకు ముందుగా ఆ దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. పదినెలలుగా విచారణ కొనసాగుతున్నా ముషారఫ్ విదేశీ ఆస్తుల వివరాలు సేకరించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాతి విచారణకు హాజరు కావలసిందిగా విదేశాంగ శాఖ మరియు ఎఫ్‌ఐఎ అధికార్లను ఆదేశించింది. ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసుతో సహా ఆయనపై అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో, పాక్‌లో ఆయన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు.