జాతీయ వార్తలు

20 తర్వాత శబరిమల వెళ్తా:తృప్తిదేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా ఈనెల 20 తర్వాత శబరిమల వెళ్తానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తిదేశాయ్ ప్రకటించారు. కేవలం ప్రచారం కోసం ఆలయ ప్రవేశానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించలేమని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ నిన్న ప్రకటించిన విషయం విదితమే. కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించాలా వద్దా అనే విషయం ప్రభుత్వానికే వదలివేస్తున్నానని, ఈ నెల 20 తర్వాత అయ్యప్ప దర్శనార్థం శబరిమలను సందర్శిస్తానని వెల్లడించారు. నేడు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇదిలావుండగా శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే మహిళాభక్తులకు రక్షణ కల్పించే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ అన్న విషయం విదితమే. ప్రస్తుతం ఆలయం వద్ద శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని, ప్రస్తుతం దేవాలయం వద్ద యథాతథా స్థితిని కొనసాగించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తిదేశాయ్ చేసిన ప్రకటనపై మంత్రి మాట్లాడుతూ కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చని అన్నారు. కాగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ కోర్టు తీర్పు విషయంలో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకున్న తరువాతే సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.