Others
సాయంత్రాలిలా తెల్లారుతున్నాయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్తమయాన్ని ఆహ్వానిస్తూ ఆకాశం
మినుకు పొడుపుల్లో
ఋక్షాక్షర శిల్ప ప్రబంధవౌతుంది
మసక వెలుతురు దీపజాలంలో పడి
మయ వుంపుగొని
చీకటి మాటల్ని చుట్టుకుంటుంది
బుద్ధి బంధితాలైన జల్పదృశ్యాలు
ఆనందకారకాలై
నిభృతావేశ నైసర్గికాలవుతాయ
ఆరుబైలు
అర్ధనగ్నంగా చేస్తున్న అభినయానికి
ఇళ్ళు కళ్ళు మూసుకుంటాయ
అంతరంగ వాంఛకు
వ్యామోహపు వౌనం లొంగి
ఆశాదేశంగా అగ్ని ప్రదక్షిణం చేస్తుంది
విశృంఖల విహారియైన రాత్రి
నీడలు పచరిస్తూ
ఉద్రేకోన్ముక్తంగా ఊరేగుతుంది
సర్వతోముఖంలో సగమైన
వరారోహభవిత
తూగుతున్న వాహనంలో జోగుతుంది
అపశబ్ద శరీరాలు రెండు
నిశ్శబ్ద పరీరంభంలో
బోర్ల-వెల్లకిల ఒళ్లు తడుముకుంటాయ
దారి తప్పిన నాగరికతకు మరో దారిలేక
కడుపులో పేగుల్ని
చుట్టచుట్టి ఎల్ల కట్టుబాటు తెంచుకుంటుంది
తప్పనిసరిగా మరుచివ్వతో మార్పు
పసి ప్రభాత క్షతజాన్ని
పచ్చి వెచ్చగా స్రావం చేసుకుంటుంది