సాహితి

మాతృఛాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీకేం తెలువదు ఊరుకో’
అన్నాడు కొడుకు
ఆమె తలెత్తి చూసి
ఓ చిరునవ్వు నవ్వి
మళ్లీ తన పనిలో మునిగిపోయింది.

‘నీదంతా పక్షపాతం
నీకు వాడంటేనే ప్రేమ’
అన్నాడు కొడుకు
ఆమె వాడి కళ్ళల్లోకి
సూటిగా చూసి
కళ్ళు మూసుకుంది.

‘నువ్వు మాకేం చేసినవ్?’
అన్నాడు కొడుకు
ఆమె నేల చూపులు చూస్తూ
మోకాళ్ళకు
గుడ్డలు కట్టుకుంటుంది.

రొమ్ముల మీదినుండి
దిగినప్పటినుంచి
ఆమెకూ వాడికీ దూరం పెరిగింది
తన గదినుంచి
ఆమె గదికిప్పుడు
యోజనాల అంతరం మిగిలింది

ఆమె చనిపోయింది
‘అమ్మా! నన్ను విడిచిపోయావెందుకే?’
అన్నాడు కొడుకు
ఇప్పుడామె కనీసం
చూడనన్నా చూస్తలేదు.

ఇంటిముందు
వేపచెట్టు కింద
నీడ మాట్లాడుతున్నది గాని
అది
ఎవరికీ అర్థంగాని భాష!

- డా. ఎన్.గోపి