సాహితి

మనిషి మనిషిగా ప్రవర్తించే రోజు కోసం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనిషితనాన్ని
మరిచిపోతే,
విస్మరిస్తే...
ఎవరు ‘గురుతు’చేయాలి?
మనిషే...
సృష్టిలో ప్రతీ జీవీ-
జంతువులు, పక్షులు
క్రిమికీటకాదులు అన్నీ
వాటికి నిర్దేశించిన
పనుల్లే అవి చేస్తున్నప్పుడు
మనిషి ‘తన’ పనుల్ని తాను
చేయడెందుకు?...
వాక్కు, వివేచన, ఆలోచన
ఉన్నందుకా?!
మనిషి మనిషిగా
ప్రవర్తించే రోజుకోసం
ఓ మనిషిగా
ఎన్నో రోజులుగా
ఎదురుచూస్తున్నా...
కళ్ళు కాయలు చేసుకొని మరీ...

- యన్.కె.నాగేశ్వరరావు, 9030360988