సాహితి

నిద్రలో మెలకువ రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి
మూగన్నుగా నిద్రబోతున్న వేళ
అలలు
తెరలు తెరలుగా వచ్చి
మొహంపై దృశ్యాన్ని తిప్పికొట్టాయ!

అంత కలత నిద్రలోనూ
ఊహల మత్తులోనూ
తడుస్తూ లేస్తూ తుళ్ళిపడుతూ
ఊగిసలాడే సందర్భంలోంచి
మెలకువ లాంటి ఉలికిపాటేదో
నాలోని పాటని మేల్కొల్పింది!

కదిపి చూస్తే
దేహమంతా కవిత్వమే!
లయాత్మకమైన పదచరణ విన్యాసమే!

తుళ్ళిపడ్డ మత్తులోంచి
ఆశగా ఎదురుచూసూ త
ఒక దేశ భవిష్యత్తును కలగన్నాను!

నేనూ దేశమూ
ఒక్కటే అనిపించింది
దేహాన్ని మించిన దేశం
అసలెక్కడైనా ఉంటుందా?

ఈ సరిగమ పదనిసల నడకలో
ఆరోహణావరోహణలు
చైతన్య ప్రతిబింబాలై
కాలాన్ని ముద్దాడుతాయ!
నిప్పులాంటి స్వరచాలనమేదో
అంతరంగాన్ని మెలిపెట్టి
దేశ పటం మీద
గౌరవ సూచికంగా ఎగరేస్తుంది!

అప్పుడు
పాటకూ పద సమూహానికీ
పెద్ద తేడా కనిపించదు

గుండెలోని మంటలాగ
మరుగుతున్న లావాలాగ
అదృశ్యమవుతున్న మెరుపు లాగ
లోలోపల ఒకటే కదలిక1

నిశ్చలమై నిర్మలమై
నిశ్శబ్దమై
నిలిచిపోయే పదచిత్రంలా
ఊహల మధ్య వెలుగుతూ
జీవితంలో కదలాడుతూ...!!!

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910