సాహితి

కరువే నయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టుకు వేలాడుతున్న
మట్టి పాదాల చుట్టూ మూగి
ఎంతగా పరితపించినా
ఏం ప్రయోజనం

చావు రహస్యాన్ని
పలుసార్లు చెవిలో ఊదినా
చలించని పాలకుల్ని
నిలదీయాలి గాని

రుతువు వెళ్లిపోయాక
రాలిన బంతిపూల మీద
ఎంతగా సానుభూతి వొలకబోసినా
ఏం ఫలితం

పొలాలమీద
పొరలు పొరలుగా విస్తరిస్తున్న
విషాద మేఘాల్ని
పసిగట్టాల్సి ఉంది

చేల పొత్తిళ్ల లోంచి
రెక్కలు విరిగిన పక్షుల్ని
అప్పుల క్రూరమృగం
ఒక్కటొక్కటిగా
నోట కరుచుకుపోతుంటే

మాటలకేం
మంత్రముగ్ధుల్ని చేస్తయి
చేతలేమో
మూతుల్ని కట్టేసి
పథకాల్ని పితుకుతుంటయి

కడుపులో
కత్తుల్ని దాచుకున్న
కంటితుడుపు ప్రహసనాల కన్న
కరువే నయం
కన్నీళ్లు పెట్టించినా
కొన్ని పాఠాలైనా నేర్పిస్తది

మనోడైతేనేం
పరాయి వాడైతేనేమి
తడిలేని వాళ్లు నాయకులైన
ఈలోకంలో

బతుకు చేజారి
బజారుపాలైన రైతు జీవితం
మృత్యు పత్రం మీద
నెత్తుటి సంతకం
చావులూ సంక్షోభాలు
ఈ నేలకేం కొత్త కాకపోవచ్చు
మాట తప్పిన కాలం
కాట కలిపి ఉండవచ్చు

గడ్డిపరకల
గొంతులు పెరికేసినంత తేలికగా
త్యాగాల్ని ఎగతాళిచేస్తే
మట్టికి పరిమళమద్దిన మనిషే
మళ్లా చరిత్ర మలిచేది మాత్రం
కచ్చితం

- కొండి మల్లారెడ్డి, 9441905525