సాహితి

దృశ్యాదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరో అంతస్తు బాల్కనీ -
ఊగీ ఊగని ఊయల
పైన
బూడిద రంగులో ఆకాశం
కింద
గాడిద మేస్తున్న మైదానం.
గత కాల వర్తమానాల రజ్జువులకి
ఊగీ ఊగని ఊయల
పెంటుహౌస్ రేకుల మధ్యనుంచి
పావురాళ్ళ మూలుగుల మూర్ఛనలు
వాటి అందం మాటెలా వున్నా,
అవి పాడుచేసిన వైనమే ఎక్కువ
ఎక్కడో విమానం ఎగురుతోంది
చిన్న పక్షిలా -
మనసులో పిల్లలు మెదిలి
గుండె ముడుచుకుంది పిట్టలా -
బావురుమంటున్న ఇంట్లో
పదిలంగా ఈ దేహం
కనురెప్పల వెనుక
గడిచిన కాలం
వెలిసిన పట్టుబట్టలా
రెపరెపలాడుతోంది
ఊగీ ఊగని ఊయల మీంచి
దృశ్యం మారింది
ఆకాశం నీలంగా -,
మైదానంలో గాడిద మాయం -
ఎర్రని పశ్చమాన
గుర్రగ అస్తమయం

- ఇంద్రగంటి జానకీబాల 9640052509