సాహితి

వానపక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గది నిండా వాన తడిముగ్గు గీసింది
అన్నం పాత్రలలో వాన నదిలా వొదిగింది -
నగర, ఆకాశంపై వానపక్షులు
నోరారా పిలిస్తే గొంతుపై వాలతాయి -
వానకు, తళతళ మెరుస్తున్న గోడపై
పడవ బొమ్మను చిత్రిస్తున్న చిన్నారి చేతులు
పడవ ఎక్కేందుకు నిరీక్షిస్తున్న వాన తడిపిన శరీరాలు -
కిటికీ రెక్క తెరిచి చూడు
వాన హరివిల్లులా వంగి లోపలికి వస్తుంది -
వాన పూర్వీకుల స్మృతులను వెలికి తీస్తుంది
నగరదారులపై పరిచయ ముఖాలు
నీటి బొమ్మల్లా నాలో కరిగిపోతాయి
పాప ఆడే ఉద్యానవనంలోని
పూలు చాన్నాళ్ళుగా వానలో తడిసి,
బురద నీటిలో మునకలేస్తున్నాయి
వాన కురిసే సమయాలు బహు విచిత్రాలు

- అరసవిల్లి కృష్ణ, 9247253884