సాహితి

మంత్రనగరి.. మాయా వాస్తవికత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజిక్ రియలిజమ్ ఈ పేరు వింటేనే అంతా మాయ, జగమే మాయలాగా అనిపిస్తుంది... అవును మరి ఆ మాటలకున్న మంత్రమే అలాంటిది. మరి అలాంటి మంత్రనగరి ద్వారా గ్లోబలైజేషన్, నాగరికతల ముసుగులో నేడు స్ర్తిలు ఎదుర్కొంటున్న అత్యాధునిక అణచివేతకి దర్పణం పి.సత్యవతి మంత్రనగరి. - మాజిక్ రియలిజమ్ లేదా మాయా వాస్తవికత, మంత్రిక వాస్తవిక ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవి కళతో ముడిపడి వున్న మాజిక్ అంశాలు. దీనినే లౌకిక, వాస్తవిక వాతావరణంలో సహజంగా వుండే విజువల్ ఆర్ట్స్... అంటే ఒక సాహిత్య ప్రకృతులను బట్టి చూస్తే వాక్యం చిత్రంగా కనిపించే సహజత్వం కథలోనూ కనిపించడమే ఈ మాయా వాస్తవికత.
మాజిక్ రిజలిజమ్ ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని మానవుడికి జరుగుతున్న సంఘటనలకు మధ్యన జరిగే మానసిక సంబంధాలను ఆవిష్కరించి, విశే్లషించే ప్రయత్నం చేస్తుంది. కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ వుండదు. రచయిత రియాలిటీని కాపీకొట్టడం గానీ, దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చేయడు. సాధారణ విషయాలని అద్భుతంగా, అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తారు. ఇందుకు చక్కని ఉదాహరణ పి.సత్యవతి కథ ‘మంత్రనగరి’. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖుల్లో మునిపల్లెరాజు, సత్యవతి ముఖ్యులు. అంతులేని పోరాటాలతో ఆంతరంగిక వేదనంతో అలసిపోయి, చీకట్లో మగ్గుతున్న సగటు స్ర్తి జీవన విధానానికి, వేదనకు అద్దం పట్టే కథలు సత్యవతి మాజిక్ రియలిజంలో వివరించారు. అందులో మంత్రనగరి కథ చూస్తే మూడు కథలు మాజిక్ రియలిజం ప్రక్రియలో వ్యక్తీకరించారు. వస్తువు ఎంచుకోవటం, కథ, కథన శిల్పం ఇలా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని పాఠకుల కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. ఈ ప్రక్రియలో సూపర్ మామ్ సిండ్రోమ్ సత్యవతి అద్భుత రచనా పాటవాన్ని వెలువరించిన కథ. ఆధునిక స్ర్తికి అద్దం పట్టే రచన. ఆడవారు మల్టీటాస్కింగ్ చెయ్యగలరనే పురుషస్వామ్య బిరుదుకి బలైన అమాయకపు తల్లి కథ. మాజిక్ రియలిజానికి చతురతను జోడించి చెప్పిన కథ. ఇంటిని అభివృద్ధి చేయాలని మొత్తం బాధ్యతని తన మీద వేసుకున్న ‘సూపర్ మామ్’ డబ్బు ఆదా చేయడం కోసం యంత్రంలా పనిచేసింది. యంత్రాలకి కూడా అప్పుడప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. కాని యంత్రం కన్నా ఎక్కువ పనిచేసే ఇల్లాలికి విశ్రాంతి దొరకదు. అందుకు పురుషులు తగిలించిన మాట ‘సూపర్ మామ్’. ఆ సూపర్ మామ్ జబ్బు పడి మరకలు ఒళ్ళంతా టాబ్లెట్లతో నిండిపోయింది. అక్కడినుంచే కథ మొదలవుతుంది. ఉద్యోగం చేసే ప్రతి మహిళ ఎదుర్కొనే మల్టీ టాస్కింగ్‌ని చిత్రీకరించిన కథ ఇది.
సత్యవతి కథల్లో సమాజానికి మంచి కుటుంబంగా కనిపించే కుటుంబ వ్యవస్థలోని డొల్లతనాన్ని వివరించే కథ ‘తిమింగల స్వర్గం’. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలంటే ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలి. అటువంటి భావాలున్న స్ర్తిని పురుషస్వామ్యం ఎలా అణచివేసిందో చెప్పే కథ తిమింగల స్వర్గం. చేసే పని, ఆలోచన, కర్తవ్యం అన్నీ మన ఇంటికే పరిమితమై వుండాలని, డబ్బు సంపాదన, కుటుంబంలో భర్తకి ఎదురుచెప్పకపోవడం, భక్తి, మతం, కులాన్ని కాపాడుకోవడం వంటి అంశాలలో మహిళలకి తర్ఫీదనేది కుటుంబం నుంచే మొదలవుతుందని కథలో చతురోక్తులతో వివరించారు సత్యవతి. ఇదంతా స్ర్తిలు కుటుంబ వ్యవస్థకు పరిమితమవడానికి, స్ర్తిలను అణచివేసిన పురుష నైజానికి ఉదాహరణగా సత్యవతి ‘తిమింగల స్వర్గం’ కథను మాజిక్ రియలిజంలో వివరించారు. గ్లోబలైజేషన్ చట్రంలో చిక్కుకుపోయిన స్ర్తిలు, నాగరికత ముసుగుకి మైమరచిపోయిన స్ర్తిలు అత్యాధునిక అణచివేతకి ఎంత ఆనందంగా తమని తాము బలిచ్చుకుంటున్నారో సత్యవతి మంత్రనగరిలోకి తొంగిచూస్తే అర్ధమవుతుంది.
తన కూతురు గీతని చూసేందుకు అమెరికా వెళ్లి అక్కడి తెలుగువారి జీవనాన్ని, ప్రాచ్య- పాశ్చాత్య కలబోతగా బ్రతుకుతున్న జీవన సరళిని చూసింది. ‘స్ర్తి’లలో వచ్చిన మార్పు, తరాలు మారేకొద్ది కనిపించే అస్పష్టమైన తెరలను చాలా స్పష్టంగా చూపించే కథ ఇది. నాటి నుంచి నేటివరకు స్ర్తిలు అనుభవించిన హింస నుంచి బయటపడినా వారి దారి మరోవైపు ఎలా మళ్లించబడిందో మంత్రనగరి కథ ఒక ఉదాహరణగా నిలిచింది. ఆనాటి తరం స్ర్తిలు స్వేచ్ఛకోసం డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసి స్ర్తి స్వేచ్ఛకోసం పాటుపడ్డారు. స్ర్తికి విముక్తి కలిగించే క్రమంలో నాటి స్ర్తిలు చేసిన కృషి తరువాతి తరాలకు సమాజాన్ని పట్టించుకునే తీరిక, ఓపిక లేకుండా చేశాయి. ఒక తరం స్ర్తిలు స్వేచ్ఛాజీవులై సమాజాన్ని మారుస్తున్నారని అనుకోగానే పాలక వర్గాల నుంచి, సామ్రాజ్యవాదుల నుంచి వాళ్లని ముంచడానికి కొత్త ఎత్తుగడలు పుట్టకొచ్చాయి. ఒక సంకెళ్లను బద్దలు కొట్టేసరికి మరో సంకెల తయారవుతోందని చెప్పే కథ మంత్రనగరి.
మంత్రనగరిలో మూడు తరాల స్ర్తిల జీవితాలను, సమాజ గమనానికి అనుగుణంగా వారి మార్పును వివరిస్తూ మొదటితరం అనసూయ తల ఎప్పుడూ వాలి వుండే రెండుగులు కూడా పెరగని మరుగుజ్జులా తయారైంది. ‘‘ఆ ఇంటి ఆడ ప్రాణులేవీ గుమ్మం దాటకూడదు... చిన్న ప్రాణులైనా సరే తెల్లవారుఝామునే కాలకృత్యాలు తీర్చుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, పూలు విచ్చుకోకముందే కోసుకోవాలి ఇది... ఆ ఇంటి సంప్రదాయం. అనసూయ పొట్టితనం, మూగతనం, తలవంగిన తనం ఏవీ పెళ్ళయ్యాక సంతాన సాఫల్యానికి అడ్డం కాలేదు. ముగ్గురు మగ పిల్లలు, చివరిది ఆడపిల్ల. ‘‘కృష్ణవేణి’’ అని పేరు పెట్టింది. తన లాగా కాకూడదని మొక్కుకునేది. ఇంటి చాకిరితో అలసిపోయి ‘‘నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటే పమిట కొంగు ఎర్రబడేది... తన రక్తాన్ని చెమట రూపంలో చిందించిన అనసూయకు తండ్రిని ఎదిరించి తనకేం కావాలో ప్రశ్నించే కూతురు పుట్టినందుకు సంతోషించింది. కాని ‘‘నన్ను ఎందుకు బడి మాన్పించావు నాన్నా? ఇంట్లో ఏమి తోచడం లేదు’’ అన్నందుకు వెంటనే కోపం తెచ్చుకుని ఆమె మెడమీద సాచి తండ్రి వేసిన దెబ్బకి వెంటనే కృష్ణవేణి తల ఆమె తల్లికి లాగ వంగిపోయింది. అప్పటినుంచి ‘‘తల ఎత్తుతూ దించుతూ ఉండడం’’ అలవాటుకాగా చూసినవాళ్లు అదొక జబ్బు అనుకునేలా మారిపోయింది.
‘‘కృష్ణవేణి అలవాటుని మొదటిరోజే గమనించిన ఆమె భర్త ఆమెడని ఒక లెవెల్లో ‘్ఫక్స్’ చేసేందుకు మేకును కొట్టాడు. ఆ బాధను మర్చిపోయేందుకు ఆమె దృష్టిని మళ్ళించేందుకు రంగుల దారాలు, సూదులు, ముగ్గుల పుస్తకాలు, డిజైన్ల పుస్తకాలు, ఒక చిన్న రేడియో కూడా కొనిచ్చాడు. కృష్ణవేణికి కూతురు, ఝాన్సిలక్ష్మి పెరిగేకొద్ది తండ్రికి, ఆమెకి ప్రతిరోజు యుద్ధమే.
ఈ కథలో చూసిన మూడు తరాల స్ర్తిల స్థితిగతులు కళ్ళకు కట్టినట్లు చూపించారు సత్యవతి. ‘స్ర్తి’కి స్వేచ్ఛ కావాలి అని స్వాతంత్య్రం ముందునుంచి ఆరాటపడిన అనసూయ, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషువారి నుంచి విముక్తి కావాలని భారతీయుల పోరాట పటిమ స్ఫూర్తితో ఇంట్లో స్ర్తిల దుస్థితి మారి వారికి కూడా సమానత్వం కావాలని పురుషుస్వామ్యంతో పోరాటం సలిపిన కృష్ణవేణి, ఇక సమానత్వానికి చట్టరూపం తీసుకొచ్చి ఆకాశంలో సగం మేమని ప్రపంచానికి తెలిసేలా గొంతెత్తి నినదించి విజయం సాధించిన ఝాన్సీలక్ష్మి- ఈ ముగ్గురూ మూడు తరాలుగా వారి జీవనానికి మాజిక్ రియలిజాన్ని కథకి జోడించి చక్కని చిత్రాన్ని గీశారు సత్యవతి. ఇక నాలుగోతరం ప్రస్తుతం కొనసాగుతున్న కాలం. ఇక్కడిక యువతి సమానత్వం కోసం పోరాటం చెయ్యనవసరం లేదు, అలాగని డబ్బుకు కొదువ లేదు, అనుకున్నదే తడవుగా తనకోసం తాను ఏమైనా చెయ్యగలదు. స్ర్తికి విద్య పెరిగింది. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. కానీ పాలకవర్గం చేతిలో ఎప్పుడూ కీలుబొమ్మ స్థానం నుంచి తప్పుకోలేదు. అందుకు నేడు మన కళ్లెదుట కనిపిస్తున్న సజీవ సాక్ష్యాలు చాలు. పై మూడు తరాలలో రెండుతరాలు అంతరించిపోయినా, మూడో తరం ఈ మార్పును కళ్లారా చూస్తూనే వున్నారు. ఏమి చేయలేక చేతలుడిగి బిత్తరపోయి చూస్తున్నారు. ప్రపంచీకరణలో వలసలు పోతున్న యువతరం పట్టణాలని, పల్లెలని కుదిపేస్తున్నాయో చూపిస్తూ ఎన్ని మార్పులు చోటుచేసుకున్నా అధునాతన మంటూ ఆడవారికి దక్కింది అత్యాధునిక అణచివేతేనని సత్యవతి చూపించిన మంత్రనగరి ఒక చక్కని ఉదాహరణ.
తరాలు మారినా స్ర్తిల తలరాతలు మార్చేది మగవారేనని, ఇది ప్రతి స్ర్తి ఎందుకు గమనించుకోలేక పోతున్నారనే ప్రశ్న ఈ కథనూ చేతలెత్తేలా సత్యవతి సమాజానికి, నేటితరం స్ర్తిలకి సవాలు విసిరారు. ఒకసారి క్లాక్ వైజ్ మార్పు, మరొకసారి అక్కడినుంచే మొదలై యాంటీక్లాక్‌వైజ్‌గా తిరిగి మొదటికే చేరుతుందని సత్యవతి మాజిక్ రియలిజంలో వివరించిన మంత్రనగరి కథని చూసిన వారికి అర్థమైపోతుంది.

- అరుణజ్యోతి, 9052116579