సాహితి

నటన దాని నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుర్చీల నగిషీలు పొదిగిన మణులు
మకుటాల మెరుపుల్ని
ద్విగుణీకృతం చేసే కెంపులు
దూరం పెరిగినందున ప్రతిఫలించే నునుపు
మేలిమిగా మెరుస్తుంటాయి
నిజానికి
గొప్పదేదీ పైన ఉండదు
అక్కడ
అవసరం కోసం
అన్ని బంధాలు పునర్నిర్మితమవుతాయి
ముసుగు కనిపించనంత
పల్చని నటనలు పండిపోతాయి
అందర్నీ స్తుతిస్తూ
తమ మీద దృశ్యాన్ని కేంద్రీకరించుకుంటారు
దాని రూపం నున్నగా ఉంటుంది
మెత్తగా ఉంటుంది
పరాకాష్టకు చేరిన ఉదాత్తతలా
గుంభనంగా, జాలిజాలిగా
హాయిహాయిగా ఉన్నట్లే ఉంటుంది
తెర మీద అందరికీ
అందినట్లే ఉంటుంది
మనతోనే మాట్లాడుతున్నట్లుంటుంది
నిజం అర్ధమయేలోపల
అక్కడికి చేరగలమో లేదో
తేల్చుకునే లోపల
దాని కాలం పూర్తవుతుంది
పథకాల గుట్టు బయల్పడే లోపల
అది యేరు దాటి పగలబడుతుంది
నటన దాని నైజం
అది సామాన్యులకు
నిజ మాన్యులకు
అందనంత దూరంగా ఉంటుంది

- ఏనుగు నరసింహారెడ్డి 8978860183